హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం

by Muthe.Rajitha |

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోమవారం అర్థరాత్రి కుండపోత వర్షం కురిసింది.

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం
X

దిశ, వెబ్ డెస్క్ : వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో తెలంగాణలో నైరుతి రుతుపవనాలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ ప్రభావంతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోమవారం అర్థరాత్రి కుండపోత వర్షం కురిసింది. ముఖ్యంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఫిలింనగర్, బోరబండ, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, సోమాజిగూడ, లోయర్ ట్యాంక్ బండ్, అశోక్ నగర్, నల్లకుంట, నారాయణగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. వర్షపు నీరు భారీగా నిలిచిపోవడంతో పలు చోట్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి, ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ స్తంభించింది. కాగా, ఈ వాయుగుండం ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(HMD) వెల్లడించింది. కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వాహనదారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Next Story