టీడీపీ ఆవిర్భావ దినోత్సవం మన కుటుంబ పండుగ: సీఎం చంద్రబాబు నాయుడు

by Malleboina Mahesh |

టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలకు చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు. ఎన్టీఆర్ ఆశయాలే పార్టీకి మార్గదర్శకమని వెల్లడి.

టీడీపీ ఆవిర్భావ దినోత్సవం మన కుటుంబ పండుగ: సీఎం చంద్రబాబు నాయుడు
X

దిశ, వెబ్ డెస్క్: ఈ రోజు తెలుగుదేశం పార్టీ (TDP) 44వ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా పార్టీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పార్టీ కార్యకర్తలకు, తెలుగు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎక్స్(twitter) వేదికగా స్పందించిన ఆయన.. ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అందులో యుగపురుషుడు నందమూరి తారక రామారావు స్థాపించిన ఈ పార్టీ, తెలుగు జాతి ఆకాంక్షలకు నిలువుటద్దమని ఆయన కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా పేదవాడికి గూడు, ఆహారం అందించే సిద్ధాంతానికి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

తెలుగుదేశం పార్టీ కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు, అది కార్యకర్తల సొంత ఇల్లు అని చంద్రబాబు పేర్కొన్నారు. ఆవిర్భావ దినోత్సవం తమకు ఒక కుటుంబ పండుగ వంటిదని, ఈ పండుగ వేళ ప్రతి కార్యకర్తకు తన వ్యక్తిగత శుభాకాంక్షలు తెలియజేస్తున్న ట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఆశయ సాధనలో భాగస్వామ్యం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Next Story