టీడీపీకి షాక్.. ట్విట్టర్ ఖాతా హ్యాక్

by Dishanational2 |
టీడీపీకి షాక్.. ట్విట్టర్ ఖాతా హ్యాక్
X

దిశ, వెబ్‌డెస్క్ : టీడీపీకి హ్యాకర్లు షాకిచ్చారు. తెలుగు దేశంపార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాను సైబర్ నేరగాళ్లు హ్యక్ చేశారు. శుక్రవారం రాత్రి నుంచి పార్టీ ట్విట్టర్ ఖాతా నుంచి అసభ్యకర మెసెజ్‌లు వస్తున్నాయి దీంతో అకౌంట్ హ్యక్‌కు గురైందని గుర్తించారు. అంతే కాకుండా ఎలాన్ మస్క్ కు చెందిన 'స్పేస్ ఎక్స్' ఫొటోలను అందులో షేర్ చేశారు. దీంతో హ్యక్‌కు గురైందని గుర్తించిన టీడీపీ వెంటనే అప్రమత్తమై ప్రకటన చేసింది. దీనిపై నారాలోకేష్ మాట్లాడుతూ.. తమ అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయిందని తెలిపారు. ట్విట్టర్ ఇండియా సహకారంతో ఖాతాను పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే టీడీపీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయిన విషయాన్ని పార్టీ నాయకులు కార్యకర్తలు గమనించాలని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.



Next Story

Most Viewed