- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైసీపీ కార్యకర్తల దాడి.. టీడీపీ నేత మృతి
by Muthe.Rajitha |
కాకినాడ జిల్లా అల్లిపూడిలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ హింసాత్మకంగా మారి టీడీపీ నేత మృతి చెందాడు.

X
దిశ, వెబ్ డెస్క్ : కాకినాడ జిల్లా అల్లిపూడిలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ హింసాత్మకంగా మారి టీడీపీ నేత మృతి చెందాడు. మొదట రెండు పార్టీల నేతలు, కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా, అది క్రమంగా తీవ్రమైంది. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తలు కత్తులతో దాడి చేయగా, బంగారయ్య అనే తెదేపా నేత తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. అదే ఘటనలో మరో కార్యకర్తకు కూడా తీవ్ర గాయాలు కావడంతో అతన్ని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు, ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొనగా, పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
Next Story






