పార్లమెంట్‌లో సోషల్ మీడియా నిషేధంపై చర్చించాలి.. అఖిలపక్ష భేటీలో టీడీపీ డిమాండ్

by Malleboina Mahesh |

కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలతో పాటు పలు జాతీయ అంశాలను ప్రస్తావించారు.

పార్లమెంట్‌లో సోషల్ మీడియా నిషేధంపై చర్చించాలి.. అఖిలపక్ష భేటీలో టీడీపీ డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ రోజు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం (All-party meeting) జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు (Sri Krishna Devaraya) ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలతో పాటు పలు జాతీయ అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానికి పూర్తిస్థాయి లెజిస్లేటివ్ బ్యాంకింగ్ ఉండాలని, ఇందుకోసం కేంద్రం చొరవ తీసుకోవాలని కోరారు.

రాష్ట్రానికి సంబంధించిన ఐదు కీలక అంశాలతో పాటు మూడు జాతీయ సమస్యలను ఈ సమావేశాల సందర్భంగా చర్చకు తీసుకురావాలని టీడీపీ (TDP) కోరింది. జాతీయ అంశాల పరంగా, 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించే (Ban on social media) అంశంపై చర్చ జరగాలని లావు శ్రీకృష్ణదేవరాయలు సూచించారు. ఆస్ట్రేలియా వంటి దేశాలు ఇప్పటికే ఈ దిశగా నిర్ణయాలు తీసుకున్నాయని, భారత్‌లో కూడా దీనిని ఎందుకు అమలు చేయకూడదని ఆయన ప్రశ్నించారు. వీటితో పాటు భారత్-యూరోపియన్ యూనియన్ (India-EU) మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (FTAs) పై కూడా సమగ్ర చర్చ జరగాలని టీడీపీ తరఫున ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Next Story