సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్ష.. టీబీజీకేఎస్, కాంగ్రెస్ సంఘీభావం

by Batti.Sumithra |

సింగరేణి అధికారుల సంఘం (CMOAI) ఆధ్వర్యంలో గోలేటి జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు టీబీజీకేఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు.

సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్ష.. టీబీజీకేఎస్, కాంగ్రెస్ సంఘీభావం
X

దిశ, రెబ్బెన : పీఆర్పీ (PRP) బకాయిలను వెంటనే చెల్లించడంతో పాటు కోల్ ఇండియా తరహా ప్రమోషన్ పాలసీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సింగరేణి అధికారుల సంఘం (CMOAI) ఆధ్వర్యంలో గోలేటి జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు టీబీజీకేఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా దీక్షా శిబిరాన్ని సందర్శించిన టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్ మల్ల రాజ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ అధికారుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని కోరారు. ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన అంశాల్లో జాప్యం తగదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ రెబ్బెన మండల అధ్యక్షుడు కేసరి కిషన్ గౌడ్ మాట్లాడుతూ అధికారులకు రావాల్సిన పీఆర్పీ బకాయిలను వెంటనే విడుదల చేసి, వారి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

ఐఎన్‌టీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ సింగరేణి సంస్థ అభివృద్ధి, లాభాల సాధనలో అధికారుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. వారి సేవలను గుర్తించి, పీఆర్పీతో పాటు పెండింగ్‌లో ఉన్న అన్ని బకాయిలను తక్షణమే చెల్లించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ మంగీలాల్ ఓరం, కిరణ్, ఆర్. శ్రీనివాస్, జూనియర్ తిరుపతి, ఏరియా కార్యదర్శి మారిన వెంకటేశ్వర్లు, ఆఫీస్ ఇన్‌చార్జి వంగ మహేందర్, మాజీ ఎంపీటీసీ సురేందర్ రాజు, దాసరి సాంబగౌడ్, యూనియన్ నాయకులు బోయిన రాజేశం, గంగు రామ్‌మోహన్, అబ్బాస్, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు జతంగుల సంజయ్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ కట్కం రవి, దిలీప్, కాంట్రాక్ట్ సంఘం నాయకులు కొర్రల రాజేష్, జాడి రాజేష్ తదితరులు పాల్గొని అధికారుల ఉద్యమానికి సంఘీభావం తెలిపారు.

Next Story