EV విభాగంలో టాటా మోటార్స్ రూ. 15 వేల కోట్ల పెట్టుబడులు!

by Disha Web Desk 17 |
EV విభాగంలో టాటా మోటార్స్ రూ. 15 వేల కోట్ల పెట్టుబడులు!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ రాబోయే ఐదేళ్ల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) విభాగంలో రూ. 15,000 కోట్ల పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించింది. ఇప్పటికే కంపెనీ నుంచి నెక్సాన్ ఈవీ మోడల్ కారు మార్కెట్‌లో మెరుగైన అమ్మకాలతో కొనసాగుతోందని, దీనికి అదనంగా మరో 10 ఈవీ కార్లు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ విభాగం అధ్యక్షుడు శైలేష్ చంద్ర అన్నారు.

భవిష్యత్తులో ఈవీ పరిశ్రమ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులను కొనసాగిస్తామని, వివిధ రకాల మోడళ్లతో పాటు వాటి ధర, డ్రైవింగ్ రేంజ్ లాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని 10 కొత్త ఈవీ కార్లపై కంపెనీ కృషి చేస్తోందని శైలేష్ చంద్ర వివరించారు. కంపెనీ ఈవీ విభాగంలో ఇదివరకే ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ సంస్థ టీపీజీ నుంచి 1 బిలియన్ డాలర్ల(రూ. 7500 కోట్లకు పైగా) నిధులను సేకరించిందని, దీంతో కంపెనీకి చెందిన ఈవీ విభాగం వ్యాపార విలువ 9.1 బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 70 వేల కోట్ల)కు చేరుకుందని కంపెనీ పేర్కొంది.



Next Story