- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
TATA Motors: వాణిజ్య వాహనాల ధరలు పెంచిన టాటా మోటార్స్!

న్యూఢిల్లీ: TATA Motors to hike prices of Commercial Vehicles| దేశీయ అతిపెద్ద వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన వాణిజ్య వాహనాల ధరలను పెంచుతున్నట్టు మంగళవారం ప్రకటించింది. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఇది వాహన మోడల్, వేరియంట్‌ని బట్టి 1.5 శాతం నుంచి 2.5 శాతం మేర పెంపు ఉంటుందని, పెంచిన ధరలు జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్టు వెల్లడించింది.
నిరంతరం పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులను నియంత్రించడానికి సాధ్యమైనంత మేరకు చర్యలు తీసుకుంటున్నామని, కానీ వివిధ స్థాయిలలో తయారీకి సంబంధించి వ్యయ భారం అధికమవుతోందని, దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వాహనాల ధరల భారాన్ని కొంతవరకు వినియొగదారులకు బదిలీ చేస్తున్నట్టు టాటా మోటార్స్ వివరించింది. కొవిడ్-19 మహమ్మారి కారణంగా పెరిగిన వివిధ ముడి సరుకుల ధరలు ఈ ఏడాది ప్రారంభంలో మొదలైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, నిరంతరం కొనసాగుతున్న సెమీకండక్టర్ల కొరత వల్ల దేశంలోని అన్ని వాహన తయారీ కంపెనీలు ధరలను పెంచుతున్నాయి. ఇటీవలే హీరో మోటోకార్ప్ తన ద్విచక్ర వాహనాల ధరలను పెంచిన సంగతి తెలిసిందే.
- Tags
- Tata Motors