- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విత్తన దుకాణాల్లో టాస్క్ ఫోర్స్ టీమ్ ఆకస్మిక తనిఖీలు
ఏన్కూరు మండల కేంద్రంలో పలు పురుగు మందుల దుకాణాలను టాస్క్‌ఫోర్స్ సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు.

దిశ, ఏన్కూర్: ప్రతి ఒక్క పురుగు మందుల దుకాణం దగ్గర స్టాక్ బోర్డు స్పష్టంగా కనబడేలా ఉండాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య దుకాణదారులకు సూచించారు. శనివారం ఏన్కూరు మండల కేంద్రంలో పలు పురుగు మందుల దుకాణాలను, విత్తనాల దుకాణాలను టాస్క్‌ఫోర్స్ సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామాల్లో తిరిగి రైతులు నమ్మబలికించే ప్రయత్నం చేస్తూ నకిలీ విత్తనాల అమ్మకాలు చేసే వారి పట్ల ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో రైతులు మొక్కజొన్న, వరి కోసిన తర్వాత పంట అవశేషాలను కాల్చకుండా భూమిలో కలియదున్ని నేలలో కార్బన్ శాతాన్ని పెంచి నేలను ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా రైతులకు సూచించారు. అదే విధంగా ఇక పై పంట అవశేషాలను కాల్చితే రూ.5,000 నుంచి రూ.25,000 వరకు జరిమానా కూడా విధించడం జరుగుతుందని తెలిపారు.
ఎల్నినో ప్రభావం కారణంగా వర్షాలు తక్కువగా పడే అవకాశం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. కంది, పెసర, మినుములు, జొన్నలు వంటి పప్పు దినుసు పంటలు వేసుకోవాలని సూచించడం జరిగింది. ప్రస్తుతం ఉన్న వర్షాలకు రైతులు తొందరపడి పత్తి విత్తనాలు వేయకూడదని, నైరుతి రుతుపవనాల వర్షం వచ్చి భూమి అదును చూసి మాత్రమే విత్తనాలు వేయాలని జులై 15 వరకు పత్తి విత్తనాలు వేసుకోవచ్చని తెలిపారు. అదే విధంగా యూరియా యాప్ ద్వారా బుక్ చేసుకుని తీసుకోవాలని సూచించారు. నానో యూరియా, నానో డిఏపి మందులను రైతులు విరివిగా వాడాలని సూచించడం జరిగింది. టాస్క్ ఫోర్స్ టీం విత్తన షాపులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. విత్తన రిజిస్టర్లు, స్టాక్ బోర్డులు తనిఖీ చేసినట్లు తెలిపారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి నరసింహారావు, వ్యవసాయ విస్తరణ అధికారులు అశోక్, సైదులు ఉన్నారు.






