మాల్దీవ్స్‌లో అందాల తార.. మల్లె పువ్వులా ఉన్నావంటూ

by Dishanational1 |
మాల్దీవ్స్‌లో అందాల తార.. మల్లె పువ్వులా ఉన్నావంటూ
X

దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ తారా సుతారియా బ్యూటిపుల్ లుక్‌తో అట్రాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తున్న నటి.. వైట్ అండ్ వైట్ అవుట్‌ఫిట్స్‌లో చందమామను తలపించింది. అంతేకాదు బీచ్‌లో సేద తీరుతున్న ఫొటోలను నెట్టింట పోస్ట్ చేసిన ఈ చిన్నది.. 'బహుషా జాజ్ వింటున్నాను. సెకండ్ లంచ్ కావాలని కలలు కంటున్నాను' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతుండగా తన అందాలను పొగిడేస్తున్న నెటిజన్లు 'మాల్దీవ్స్‌లో మలెపువ్వులా ఉన్నావ్' అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల జాన్ అబ్రహంతో తను నటించిన 'ఏక్ విలన్ రిటర్న్స్' జులై 29న రిలీజ్ కాబోతుంది. ఈ మేరకు ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టిన తార.. తనదైన స్టైల్‌లో సోషల్ మీడియాతో పాటు పలు వేదికలపై సినిమా గురించి భారీగా ప్రచారం చేస్తోంది.



Next Story

Most Viewed