తమిళనాడు నేరస్థులకు స్వర్గధామమైంది.. అన్నామలై తీవ్ర ఆరోపణలు

by Kema Shiva Kumar |

అధికార డీఎంకే సారథ్యంలో తమిళనాడు రాష్ట్రం నేరస్థులకు స్వర్గధామమైందని బీజేపీ నేత అన్నామలై సంచలన ఆరోపణలు చేశారు.

తమిళనాడు నేరస్థులకు స్వర్గధామమైంది.. అన్నామలై తీవ్ర ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: అధికార డీఎంకే (DMK) సారథ్యంలో తమిళనాడు రాష్ట్రం నేరస్థులకు స్వర్గధామమైందని బీజేపీ నేత అన్నామలై (Annamalai) సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ ఆయన ఓ నేషనల్ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ.. డీఎంకే అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో రాష్ట్రంలో హింస విపరీతంగా పెరిగిందని మర్శించారు. అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్లు, గంజాయి వ్యాపారులు, అక్రమ ఆయుధ విక్రేతలకు డీఎంకే పార్టీ ఆశ్రయం ఇస్తోందని ఆయన ఫైర్ అయ్యారు. ఆయుధాల అక్రమ రవాణా (Gun-Running) కేసులో డీఎంకే పార్టీకి చెందిన రతిన బాలన్ (Rathina Balan) అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయడం ప్రభుత్వానికి సిగ్గుచేటని కామెంట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా తుపాకులను విక్రయించడానికి ప్రయత్నిస్తుండగా రతిన బాలన్, అతని అనుచరుడు అమీర్ సుహైల్‌ (Amir Suhail)లను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

కేవలం బీజేపీయే కాకుండా, ఏఐఏడీఎంకే (AIADMK) నేత ఎడప్పాడి పళనిస్వామి కూడా దీనిపై స్పందిస్తూ.. శాంతికి నిలయమైన తమిళనాడు ఇప్పుడు వ్యవస్థీకృత నేరాలకు కేంద్రంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ ప్రస్తుతం ఈ ఇద్దరి వ్యాఖ్యలు రాష్ట్రంలో పొలిటికల్ హీట్‌ను పుట్టిస్తున్నాయి.

Next Story