Tamannaah Bhatia: గోల్డెన్ గర్ల్‌ను అంటున్న మిల్కీ బ్యూటీ.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్

by Mallepaka Hamsa |   (  Updated:2024-11-22 10:20:43  IST  )

స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా(Tamannaah Bhatia) వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.

Tamannaah Bhatia: గోల్డెన్ గర్ల్‌ను అంటున్న మిల్కీ బ్యూటీ.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా(Tamannaah Bhatia) వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఈ అమ్మడు సినీ రంగంలోకి అడుగుపెట్టి దశాబ్దం అవుతున్నప్పటికీ చేతి నిండా సినిమాల(Movies)తో ఫుల్ బిజీగా ఉంటుంది. ఓ వైపు మూవీస్ చేస్తూనే మరోవైపే వెబ్‌సిరీస్‌(Webseries)లతో ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రజెంట్ మిల్కీ బ్యూటీ ‘సికిందర్ కా ముక్దార్’(Sikandar ka Muqaddar) అనే ఓటీటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దర్శకుడు నీరజ్ పాండే తెరకెక్కించిన ఈ సినిమాలో జిమ్మీ షెర్గిల్, అవినాష్ తివారి కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్(Netflix) సొంతం చేసుకుంది. అయితే నవంబర్ 29 నుంచి స్ట్రీమింగ్(Streaming) అందుబాటులోకి రాబోతుంది.

ఇక ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన తమన్నా(Tamannaah Bhatia) వరుస పోస్టులు పెడుతూ ఆసక్తిని పెంచుతోంది. ఈ క్రమంలో.. తాజాగా, ఇన్‌స్టాగ్రామ్(Instagram) ద్వారా కొన్ని బ్యూటిఫుల్ ఫొటోలు షేర్ చేసింది. ఇందులో గోల్డెన్ కలర్ డ్రెస్ ధరించి తన వయ్యారమైన అందంతో స్టిల్స్ ఇచ్చింది. ఈ పోస్ట్‌కు ‘‘ఇక్కడ చూడండి నా దగ్గర లేదు. కానీ నేను గోల్డెన్ గర్ల్‌ను. గెట్ రెడీ ‘సికిందర్ కా ముక్దార్’ నెట్‌ఫ్లిక్స్‌(Netflix)లో నవంబర్ 29నుండి అందుబాటులోకి రాబోతుంది’’ అనే క్యాప్షన్ జత చేసింది. ఇక తమన్నా ఫొటోలు చూసిన నెటిజన్లు ఆమెను బ్యూటీ క్వీన్, అంటూ పొగుడుతున్నారు.

Next Story