డ్యూరాండ్ లైన్ ఔట్ పోస్టుపై దాడి.. పాక్ సైన్యాన్ని హతమార్చిన తాలిబన్లు

by Muthe.Rajitha |

డ్యూరాండ్ లైన్ వద్ద పాక్ ఆర్మీ అవుట్‌పోస్ట్‌లను తాలిబన్లు ధ్వంసం చేసి, భారీగా ప్రాణనష్టం కలిగించినట్టు సమాచారం. ధ్వంసం చేసిన తాలిబన్లు

డ్యూరాండ్ లైన్ ఔట్ పోస్టుపై దాడి.. పాక్ సైన్యాన్ని హతమార్చిన తాలిబన్లు
X

దిశ, వెబ్ డెస్క్ : డ్యూరాండ్ లైన్ వద్ద పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. తాలిబన్ల దాడిలో పాక్ సైన్యం భారీగా ప్రాణనష్టాన్ని చవిచూసింది. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులను వేరుచేసే వివాదాస్పద డ్యూరాండ్ లైన్ (Durand Line) వద్ద మరోసారి తుపాకుల మోత మోగింది. తాజా సమాచారం ప్రకారం.. డ్యూరాండ్ సరిహద్దు వెంబడి ఉన్న పాకిస్థాన్ సైనిక అవుట్‌పోస్ట్‌పై ఆఫ్ఘన్ తాలిబన్ ఫైటర్లు భారీ ఆయుధాలతో విరుచుకుపడ్డారు. ఈ ఆకస్మిక దాడిలో పలువురు పాక్ సైనికులు హతమవ్వగా, మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. డ్యూరాండ్ లైన్ వద్ద పాక్ సైన్యం నిర్మిస్తున్న ఫెన్సింగ్ (కంచె)ను తాలిబన్లు ఎప్పటి నుండో వ్యతిరేకిస్తున్నారు. ఈ వివాదమే తాజా ఘర్షణకు దారితీసినట్లు తెలుస్తోంది. తాలిబన్లు అత్యాధునిక అమెరికన్ మేడ్ రైఫిళ్లు, రాకెట్ లాంచర్లను ఉపయోగించి పాక్ ఆర్మీ బంకర్లను ధ్వంసం చేయడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

ఈ దాడి పాకిస్థాన్ అంతర్గత భద్రతకు పెద్ద సవాలుగా మారింది. ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుండి డ్యూరాండ్ లైన్ వద్ద ఇరు దేశాల సైన్యాల మధ్య కాల్పులు సాధారణం అయ్యాయి. పాకిస్థాన్ ప్రభుత్వం ఈ దాడులను "తీవ్రవాద చర్య"గా అభివర్ణిస్తుండగా, తాలిబన్ల ప్రతినిధులు మాత్రం తమ భూభాగంలో పాక్ అక్రమ నిర్మాణాలను అడ్డుకుంటున్నామని వాదిస్తున్నారు. ఈ ఘర్షణల వల్ల సరిహద్దు గ్రామాల్లోని ప్రజలు భయంతో ఇళ్లను వదిలి వెళ్ళిపోతున్నారు. పాక్ ఆర్మీ ఇప్పుడు ఈ ప్రాంతానికి అదనపు బలగాలను, హెలికాప్టర్లను పంపించి ప్రతిదాడికి సిద్ధమవుతోంది. ఇది గనుక పూర్తిస్థాయి యుద్ధంగా మారితే, ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్‌ ఎకానమీలో మరింత దిగజారిపోనుంది.

Next Story