బీఆర్ఎస్‌లో చేరిన తక్కలపల్లి రవీందర్ రావు

by Gantepaka Srikanth |

నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

బీఆర్ఎస్‌లో చేరిన తక్కలపల్లి రవీందర్ రావు
X

దిశ, వెబ్‌డెస్క్: నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దశాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న తక్కలపల్లి రవీందర్ రావు ఈ రోజు హైదరాబాద్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు రవీందర్ రావుకి ఘన స్వాగతం పలికారు. రవీందర్ రావు గత పదేళ్లుగా నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ కన్వీనర్‌గా, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. గతంలో ఆయన రెండుసార్లు ఎంపీపీగా మరియు సింగిల్ విండో చైర్మన్‌గా పనిచేసి నియోజకవర్గంలో మంచి పట్టు సాధించారు. కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు మరియు మోసపూరిత వైఖరిని నిరసిస్తూ, ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఆయన బీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు.

ఈ చేరిక నర్సంపేట నియోజకవర్గ రాజకీయాల్లో, ముఖ్యంగా నర్సంపేట మున్సిపాలిటీ మరియు ఖానాపురం మండలాల్లో బీఆర్ఎస్ పార్టీకి కొండంత అండగా నిలుస్తుందని పెద్ది సుదర్శన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ ఉన్న రవీందర్ రావు పార్టీలోకి రావడం శుభపరిణామమని, రాబోయే రోజుల్లో పార్టీ మరింత పటిష్టం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Next Story