స్టేజ్‌పై జాకెట్ తీసేయ్ అంటూ అసభ్యకర కామెంట్స్.. స్ట్రాంగ్‌గా ఇచ్చిపడేసిన చిన్మయి

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-17 03:43:30  IST  )

సింగర్ చిన్మయి(Chinmayi) సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

స్టేజ్‌పై జాకెట్ తీసేయ్ అంటూ అసభ్యకర కామెంట్స్.. స్ట్రాంగ్‌గా ఇచ్చిపడేసిన చిన్మయి
X

దిశ, సినిమా: సింగర్ చిన్మయి(Chinmayi) సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, అవమానాలపై ఎప్పుడూ తనదైన స్టైల్లో స్పందింస్తుంటుంది. ఈసారి ఓ షాకింగ్ ఘటనపై తీవ్రంగా స్పందించారు. తాజాగా ఆమె ట్విట్టర్‌లో షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట పెద్ద చర్చకు దారి తీసింది. ఆ వీడియోలో ఓ ఈవెంట్ జరుగుతున్న సమయంలో స్టేజ్‌పై ఉన్న అమ్మాయిలను ఉద్దేశించి ఓ వ్యక్తి అనుచితంగా మాట్లాడటం కనిపిస్తోంది. అంతేకాదు.. అతడి అసభ్య వ్యాఖ్యలకు అక్కడున్న కొంతమంది ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం పరిస్థితి తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ దృశ్యాలు చూసిన చిన్మయి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన చిన్మయి.. ‘‘ప్రేక్షకులు చీరింగ్ చేస్తుండగానే స్టేజ్‌పై ఉన్న అమ్మాయిలను ఇలా అవమానిస్తారని ఊహించలేదు. ఒక వ్యక్తి జాకెట్ తీసేయమంటూ అశ్లీలంగా మాట్లాడాడు.

దానికి అక్కడున్నవారు చప్పట్లు కొట్టారు. ఇది బయటకు రావడం మంచిదా కాదా కూడా అర్థం కావడం లేదు. ఇక్కడ కనిపిస్తున్న భాష, ప్రవర్తన అత్యంత నీచమైనవి. ఇది పూర్తిగా అశ్లీల గందరగోళమే’’ అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. చిన్మయి ఈ వీడియోను షేర్ చేయడంతో ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ మొదలైంది. పలువురు నెటిజన్లు ఆమె వ్యాఖ్యలను సమర్థిస్తూ మహిళల భద్రత, గౌరవంపై చర్చ జరగాలని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కొంతమంది మాత్రం ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వేగంగా వైరల్ అవుతోంది.

Read More..

Kajal Aggarwal: కాజ‌ల్ అగ‌ర్వాల్ షాకింగ్ వీడియో వైర‌ల్‌

Next Story