Kajal Aggarwal: కాజ‌ల్ అగ‌ర్వాల్ షాకింగ్ వీడియో వైర‌ల్‌

by velandi.Saikiran |

హీరోయిన్ కాజల్ అగర్వాల్ జిమ్ లో కసరత్తులు చేస్తూ కనిపించారు. పెళ్లి తర్వాత కాస్త బొద్దుగా తయారైన కాజల్ అగర్వాల్, ఇప్పుడు పూర్తిగా మారిపోయారు.

Kajal Aggarwal: కాజ‌ల్ అగ‌ర్వాల్ షాకింగ్ వీడియో వైర‌ల్‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ అగ్ర హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫ్యామిలీ జోనర్ లో అనేక సినిమాలు చేసిన కాజల్ అగర్వాల్, మగధీర లాంటి పెద్ద సినిమాలో నటించి పాపులర్ అయ్యారు. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని దూసుకు వెళ్తున్నారు. పెళ్లి అయినప్పటికీ కూడా ఆమెకు ఇండస్ట్రీలో అవకాశాలు వస్తున్నాయి.

జిమ్ లో కాజల్ అగర్వాల్ కసరత్తులు

అయితే అలాంటి హీరోయిన్ కాజల్ అగర్వాల్ జిమ్ లో కసరత్తులు చేస్తూ కనిపించారు. పెళ్లి తర్వాత కాస్త బొద్దుగా తయారైన కాజల్ అగర్వాల్, ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. సన్నగా కరెంటు తీగలాగా కనిపిస్తున్నారు కాజల్. రామాయణం సినిమా కోసం హీరోయిన్ కాజల్ అగర్వాల్ కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.

నితీష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న రామాయణం సినిమాలో మండోదరి.. పాత్రలో కాజల్ అగర్వాల్ మెరువబోతున్నారట. ముందుగా ఈ మండోదరి పాత్ర కోసం నయనతార పేరు వినిపించినప్పటికీ, కాజల్ అగర్వాల్ ఫైనల్ అయినట్లు టాక్. ఈ నేపథ్యంలోనే స్లిమ్ గా కనిపించేందుకు జిమ్ లో కష్టపడుతున్నారట కాజల్ అగర్వాల్. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Next Story