- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏసీబీకి చిక్కిన తాడేపల్లిగూడెం మున్సిపల్ సర్వేయర్.. రూ. 50 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా!
తాడేపల్లిగూడెం మున్సిపల్ సర్వేయర్ రామకృష్ణ నివాసంలో ఏసీబీ దాడులు. సర్వే రిపోర్ట్ కోసం రూ. 50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన సర్వేయర్.

దిశ, వెబ్ డెస్క్: ఏసీబీ అధికారులు ఎంతమంది ప్రభుత్వ అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటున్నప్పటికి.. లంచం తీసుకునే అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా తాడేపల్లిగూడెం మున్సిపల్ సర్వేయర్‌గా పనిచేస్తున్న అధికారి ఇంట్లో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. రామకృష్ణ అనే రైతుకు ఒక స్థలానికి సంబంధించి సర్వే రిపోర్టు ఇవ్వడానికి రూ. 50,000 లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో, వారు పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగారు. మంగళవారం రామకృష్ణ తన నివాసంలో ఆ నగదును తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలుస్తుంది.
అనంతరం రామకృష్ణ నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అవినీతికి పాల్పడే ప్రభుత్వ ఉద్యోగులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 14400 కి ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు, తదుపరి విచారణ నిమిత్తం ఏసీబీ కోర్టుకు తరలించనున్నారు.






