పెళ్లికి సిద్ధమైన తాప్సీ.. ముహూర్తం ఫిక్స్.. వరుడెవరో తెలుసా?

by Disha Web |
పెళ్లికి సిద్ధమైన తాప్సీ.. ముహూర్తం ఫిక్స్.. వరుడెవరో తెలుసా?
X

దిశ, సినిమా: టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌లోకి షిఫ్ట్ అయిన స్టార్ నటి తాప్సీ పన్ను త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. గత కొన్ని రోజులుగా బ్యాడ్మింటన్ ప్లేయర్ 'మాథియాస్ బో'తో ప్రేమలో ముగినితేలుతున్న భామ.. త్వరలోనే మూడుముళ్లు వేయించుకోబోతున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

టూర్లు, వెకేషన్లతో ఎంజాయ్ చేస్తూ కాలం గడుపుతున్న ఇద్దరిని.. వీలైనంత త్వరగా ఒక్కటి చేసేందుకు ఇరు కుటుంబాలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ముహూర్తం కూడా ఫిక్స్ చేశారని, త్వరలోనే అధికారిక ప్రకటన కూడా ఉండనుందని బాలీవుడ్ టాక్. ఇక తాప్సీ తెలుగులో నటించిన 'మిషన్ ఇంపాజిబుల్' సినిమా ఏప్రిల్ 1న విడుదల కాబోతుంది.

Next Story