టీ20 వరల్డ్ కప్ 2026.. సల్మాన్ ఆఘా నేతృత్వంలో పాక్ జట్టు ప్రకటన

by Malleboina Mahesh |

బంగ్లాదేశ్ తరహాలోనే పాకిస్తాన్ కూడా టీ20 వరల్డ్ కప్ దూరంగా ఉండనుందని వస్తున్న వార్తలకు చెక్ పడింది.

టీ20 వరల్డ్ కప్ 2026.. సల్మాన్ ఆఘా నేతృత్వంలో పాక్ జట్టు ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్ తరహాలోనే పాకిస్తాన్ కూడా టీ20 వరల్డ్ కప్ (T20 World Cup 2026)కు దూరంగా ఉండనుందని వస్తున్న వార్తలకు చెక్ పడింది. ఈ రోజు మధ్యాహ్నం 2026 టీ 20 ప్రపంచ కప్ కు పురుషుల జట్టును పాకిస్థాన్ (Pakistan) అధికారికంగా ప్రకటించింది. భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మెగా టోర్నీ కోసం సల్మాన్ అలీ ఆఘా (Salman Ali Agha)ను కెప్టెన్‌గా నియమిస్తూ సెలెక్టర్లు నిర్ణయం తీసుకున్నారు.

ఈ జట్టులో పలు ఆసక్తికర మార్పులు చోటు చేసుకోగా, ముఖ్యంగా వెటరన్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రౌఫ్‌ (Haris Rauf)కు చోటు దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఫేస్ దళాన్ని షాహీన్ షా ఆఫ్రిది, నసీమ్ షా ముందుండి నడిపించనున్నారు. టీ20ల్లో ఆల్-టైమ్ రికార్డ్ రన్ స్కోరర్ అయిన బాబర్ ఆజం, ఇటీవల బిగ్ బాష్ లీగ్‌లో పేలవ ప్రదర్శన కనబరిచినప్పటికీ తన స్థానాన్ని కాపాడుకున్నారు.

పాకిస్థాన్ జట్టు: సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ఖ్వాజా మహమ్మద్ నఫయ్ (కీపర్), మహమ్మద్ నవాజ్, మహమ్మద్ సల్మాన్ మీర్జా, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్ (కీపర్), నయీమ్ అయూబ్, షాహీన్ షా అఫ్రిది, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్, ఉస్మాన్ తారిఖ్.

భారత్‌తో హై-వోల్టేజ్ పోరు: గ్రూప్-Aలో భాగంగా ఉన్న పాకిస్థాన్, ఫిబ్రవరి 7న నెదర్లాండ్స్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఫిబ్రవరి 10న అమెరికాతో తలపడనుండగా, ఫిబ్రవరి 15న కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో చిరకాల ప్రత్యర్థి భారత్‌తో కీలక పోరు జరగనుంది. ఈ మెగా టోర్నీకి ముందు పాక్ జట్టు జనవరి 29 నుంచి ఆస్ట్రేలియాతో స్వదేశంలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది.

Next Story