- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
T20 WC Super 8: సెమీస్ బెర్తు కోసం కివీస్, పాక్ పోరు.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్
టీ20 ప్రపంచ కప్ లో భాగంగా సూపర్ 8 లోని మొదటి మ్యాచులో న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు కొలంబో వేదికగా తలపడుతున్నాయి. కొలంబోలో టాస్ గెలిచిన పాక్ బ్యాటింగ్ ఎంచుకుంది.

దిశ, వెబ్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఉత్కంఠభరితమైన సూపర్-8 1st మ్యాచ్ ప్రారంభమైంది. కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో న్యూజిలాండ్-పాకిస్థాన్ జట్ల మధ్య ఈ కీలక మ్యాచ్ జరుగుతోంది. ఇందులో పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నారు. సెమీఫైనల్ రేసులో నిలవాలంటే ఇరు జట్లకు ఈ విజయం అత్యంత అవశ్యం కావడంతో మైదానంలో హోరాహోరీ పోరు నెలకొంది. అయితే టాస్ వేసిన కొద్దిసేపటికే వర్షం రావడంతో ఆట ప్రారంభానికి స్వల్ప అంతరాయం కలిగింది.
జట్ల వివరాల్లోకి వెళ్తే.. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ అనారోగ్యం నుంచి కోలుకుని తిరిగి జట్టు పగ్గాలు చేపట్టారు. పాకిస్థాన్ జట్టులో ఒక మార్పు చోటుచేసుకుంది. ఖవాజా నఫాయ్ స్థానంలో ఫఖర్ జమాన్ తుది జట్టులోకి వచ్చారు. గణాంకాలను పరిశీలిస్తే, టీ20ల్లో ఈ రెండు జట్లు తలపడిన 49 సందర్భాలలో పాకిస్థాన్ 24 సార్లు, న్యూజిలాండ్ 23 సార్లు గెలిచి సమఉజ్జీలుగా ఉన్నాయి. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు ఒక్కో పాయింట్ లభిస్తుంది. ప్రస్తుతం క్రికెట్ అభిమానులందరి కళ్లు ఈ ‘డూ ఆర్ డై’ మ్యాచ్ ఫలితంపైనే ఉన్నాయి.
న్యూజిలాండ్ ప్లేయింగ్ XI: టిమ్ సీఫెర్ట్(w), ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), జేమ్స్ నీషమ్, మాట్ హెన్రీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్
పాకిస్థాన్ ప్లేయింగ్ XI: సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా(సి), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖాన్(w), షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, సల్మాన్ మీర్జా, ఉస్మాన్ తారిఖ్






