ఐసెట్ అభ్యర్థులకు టీశాట్ డిజిటల్ పాఠాలు.. రేపటి నుండే ప్రసారాలు ప్రారంభం

by Malleboina Mahesh |

"రేపటి నుండి టీశాట్‌లో ఐసెట్-2026 డిజిటల్ పాఠాలు ప్రారంభం! విద్యా, నిపుణ ఛానళ్లలో ప్రతిరోజూ ప్రసారం. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సీఈవో సూచన."

ఐసెట్ అభ్యర్థులకు టీశాట్ డిజిటల్ పాఠాలు.. రేపటి నుండే ప్రసారాలు ప్రారంభం
X

దిశ, తెలంగాణ బ్యూరో: పలు పోటీ పరీక్షలకు డిజిటల్ లెసన్స్ అందిస్తోన్న టీశాట్ (T SAT) నెట్వర్క్ తెలంగాణ ఐసెట్ 2026 పరీక్షలకు సైతం డిజిటల్ లెసన్స్ అందిస్తోందని సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి (Venugopal Reddy) ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ‌లోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించే ఎంబిఎ, ఎంసిఎ అర్హత పరీక్ష ఐసెట్ కోసం ఫిబ్రవరి 23వ తేదీ సోమవారం నుండి ప్రసారాలు మొదలవుతాయన్నారు.

తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2026 మే 13,14 వ తేదీన జరగనుండగా ఎనలిటిక్ ఎబిలిటీ, మ్యాథమెటిక్స్, కమ్యూనికేషన్ ఎబిలిటీ తదితర సబ్జెక్టులపై రోజుకు రెండు సబ్జెక్టుల చొప్పున ప్రసారం చేయనున్నామని, విద్యా ఛానల్ లో ఉదయం ఐదు నుండి ఆరు గంటల వరకు, నిపుణ ఛానల్ లో సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల వరకు డిజిటల్ లెసన్స్ ప్రసారమవుతాయి సీఈవో వివరించారు. తెలంగాణాలోని విద్యార్థులు టీశాట్ డిజిటల్ లెసన్స్ సద్వినియోగం చేసుకోవాలని సీఈవో వేణుగోపాల్ రెడ్డి సూచించారు.

Next Story