హాలీవుడ్ బోర్డుపై బ్రాలతో రచ్చ.. చిక్కుల్లో స్టార్‌ నటి సిడ్నీ స్వీనీ!

by Malleboina Mahesh |

హాలీవుడ్ నటి సిడ్నీ స్వీనీ తన కొత్త లాంజేరీ (లోదుస్తుల) బ్రాండ్ 'SYRN' ప్రచారం ఆమెపై క్రిమినల్ కేసులు నమోదయ్యే విధంగా చేసింది.

హాలీవుడ్ బోర్డుపై బ్రాలతో రచ్చ.. చిక్కుల్లో స్టార్‌ నటి సిడ్నీ స్వీనీ!
X

దిశ, వెబ్ డెస్క్: హాలీవుడ్ నటి సిడ్నీ స్వీనీ తన కొత్త లాంజేరీ (లోదుస్తుల) బ్రాండ్ 'SYRN' ప్రచారం ఆమెపై క్రిమినల్ కేసులు నమోదయ్యే విధంగా చేసింది. ప్రమోషన్ లో భాగంగా ఆమె లాస్ ఏంజిల్స్‌లోని ప్రసిద్ధ 'Hollywood' బోర్డుపైకి ఎక్కి సంచలనం సృష్టించింది. రాత్రిపూట రహస్యంగా తన టీమ్‌తో కలిసి వెళ్ళిన నటి.. Hollywood' బోర్డులోని 'H' అక్షరం పైకి ఎక్కి తన బ్రాండ్ లోదుస్తులను (బ్రాలను) వరుసగా వేలాడదీసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అది కాస్తా వివాదంగా మారింది. ఈ ప్రచారానికి అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ మద్దతు ఉన్నట్లు సమాచారం, అందుకే ఈ స్టంట్ అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.

చట్టపరమైన చిక్కులు.. క్రిమినల్ కేసు నమోదు?

కాగా నటి చేసిన ఈ చర్య హాలీవుడ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (Hollywood Chamber of Commerce) ఆగ్రహానికి కారణమైంది. ఆమెకు అక్కడ షూటింగ్ చేసుకోవడానికి అనుమతి ఉన్నప్పటికీ, చారిత్రాత్మకమైన ఆ బోర్డును ముట్టుకోవడానికి, దానిపైకి ఎక్కడానికి ఎలాంటి అనుమతి లేదని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తిని అతిక్రమించినందుకు (Criminal Trespass), దానిని వికృతీకరించినందుకు (Vandalism) సిడ్నీపై క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. లాస్ ఏంజిల్స్ పోలీసులు ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే ఆమె భారీ జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. గతంలో ఇతర సెలబ్రిటీలు ఇలా చేసిన సందర్భంలో వారిపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

Next Story