శ్రీ చెన్నకేశవస్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

by Jakkula.Mamatha |

చింతకాని గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు.

శ్రీ చెన్నకేశవస్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం
X

దిశ, చింతకాని: చింతకాని గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. ఖమ్మం డివిజన్ దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ ఆర్.సమత, ఆలయ ఈవో రామకోటేశ్వరరావు, ఆలయ పూజారులు శ్రీనివాసాచార్యులు, గోపి చార్యులు, ఆలయ నిర్వాహకులు నాగార్జున సమక్షంలో నూతన చైర్మన్‌గా యండపల్లి శ్రీనివాసరావు, కమిటీ సభ్యులుగా కొమ్మిని రామారావు, తూము భిక్షం,పెద్దగౌండ్ల వెంకటనారాయణ, కొడవకంటి రాంబాబు, బండి తిరపయ్య, నవత ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చింతకాని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కన్నెబోయిన గోపి, చింతకాని మాజీ సర్పంచ్, ఖమ్మం జిల్లా మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మాడిపల్లి భాస్కర్ గౌడ్, మాజీ సర్పంచ్ బండి సైదేశ్వర్ రావు హాజరై నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కమిటీ కృషి చేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో చింతకాని గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షులు ఎస్.కే.అబ్దుల్ మజీద్, కూరపాటి కిషోర్, బందెల నాగార్జున,కొప్పుల గోవిందరావు,చింతకాని ఇన్‌చార్జి వంగూరు రమేష్, మాజీ సర్పంచ్ బండి సుభద్ర, జగన్నాధపురం సర్పంచ్ భర్త రమేష్,కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ప్రగతి, హరీష్, చింతకాని మైనార్టీ అధ్యక్షులు ఎస్.కే. దస్తగిరి, మత్కేపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎస్.కే. కాసిం, పోట్ల నాగేశ్వరరావు, బండి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై నూతన కమిటీకి అభినందనలు తెలిపారు.

Next Story