- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుదాఘాతంతో ప్లైవుడ్ కంపెనీ దగ్ధం
by Jakkula.Mamatha |
భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నారాయణగిరిలో గల జై భవాని ప్లెవుడ్ కంపెనీలో ప్రమాదవశాత్తు శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ సంభవించి పూర్తిగా దగ్ధమైంది.

X
దిశ,భూదాన్ పోచంపల్లి: భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నారాయణగిరిలో గల జై భవాని ప్లెవుడ్ కంపెనీలో ప్రమాదవశాత్తు శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ సంభవించి పూర్తిగా దగ్ధమైంది. పెద్ద మొత్తంలో మంటలు చెలరేగడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. హుటాహుటిన ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో భువనగిరి, హయత్ నగర్, చౌటుప్పల్ నుంచి ఫైర్ ఇంజన్లు చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పోలీసులు చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






