- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇది నిజంగా భిన్నమైన అనుభూతిని ఇస్తోంది.. సమంత ఎమోషనల్ కామెంట్స్
ప్రతి సినిమా ప్రత్యేకమైనదే అయినప్పటికీ, ఈ చిత్రం మాత్రం తనకు చాలా వ్యక్తిగతమైనదని, ఇందులో తన భావోద్వేగాలు ఎంతో దాగి ఉన్నాయని వెల్లడించారు.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటీస్ కారణంగా పూర్తిగా సినిమాలకు దూరం అయి.. మళ్లీ ‘మా ఇంటి బంగారం’ తో బిగ్ స్క్రీన్‌పై కనిపించారు. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సమంత తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవ్ పిక్చర్స్ బ్యానర్‌పై భర్త రాజ్ నిడిమోరుతో కలిసి నిర్మించారు. అయితే ఈ సినిమా జూన్ 19న థియేటర్స్‌లోకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబట్టడంతో పాటుగా.. సినీ సెలబ్రిటీల ప్రశంసలు కూడా పొందుతూ.. బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. ఈనేపథ్యంలో.. తాజాగా, సమంత ‘మా ఇంటి బంగారం’ సక్సెస్ అవడంపై ఎమోషనల్ అయ్యారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా సామ్ మాట్లాడుతూ.. ఈ విజయం తనకు చాలా భిన్నంగా అనిపిస్తోందని సమంత చెప్పారు. ప్రతి సినిమా ప్రత్యేకమైనదే అయినప్పటికీ, ఈ చిత్రం మాత్రం తనకు చాలా వ్యక్తిగతమైనదని, ఇందులో తన భావోద్వేగాలు ఎంతో దాగి ఉన్నాయని వెల్లడించారు. దర్శకుడు రాజ్ మొదటి నుంచీ ఈ కథను నమ్మారని.. ఒక రచయితగా, ఈ సినిమా ప్రపంచాన్ని సృష్టించిన వ్యక్తిగా ఆయన ఎంతో నమ్మకంతో దీనిని ముందుకు తీసుకెళ్లారని కొనియాడారు.
ఒక కథను మొదటి నుండి అందరూ కలిసి నిర్మించినప్పుడు, దాని విజయం కూడా ఆ కథను నమ్మిన ప్రతి ఒక్కరికీ చెందుతుందని, ముఖ్యంగా అందరిలో అనుమానాలు ఉన్న సమయంలో కూడా నమ్మకం ఉంచిన వాళ్లకు ఈ సక్సెస్ సొంతమని ఆమె వివరించారు. ఇది నిజంగా భిన్నమైన అనుభూతిని ఇస్తోందని అన్నారు. అందుకే తాము ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నామని సమంత తెలిపారు. అయితే ఇప్పటివరకు పెద్దగా ఎలాంటి ఈవెంట్స్ చేయలేదని, ప్రస్తుతానికి ఈ సంతోషాన్ని పూర్తిగా అనుభవిస్తూ.. ప్రేక్షకులకు, తమ చిత్ర బృందానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామని అన్నారు. కృతజ్ఞతతో ఉండటమే అన్నింటికంటే పెద్ద సెలబ్రేషన్ అని తాను భావిస్తున్నట్లు చెప్పారు. విజయం అనేది చాలా అద్భుతమైనదని, కానీ అదే సమయంలో ప్రేక్షకులకు నచ్చేలా నిజాయితీ గల కథలను అందించాలనే బాధ్యతను కూడా పెంచుతుందని అన్నారు. ఒక నిర్మాతగా ఎప్పుడూ అలాంటి మంచి కథలకే తన మొదటి ప్రాధాన్యత ఉంటుందని సమంత స్పష్టం చేశారు.






