పొట్టి టైట్ డ్రెస్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన నందిత శ్వేత

by Pulgam srinivas |   (  Updated:2026-07-03 05:03:23  IST  )

పొట్టి డ్రెస్‌లో ట్రెండీ లుక్‌తో మెరిసిన నందిత శ్వేత.

పొట్టి టైట్ డ్రెస్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన నందిత శ్వేత
X

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ బ్యూటిఫుల్ నటి నందిత శ్వేత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 2008లో విడుదలైన కన్నడ చిత్రం 'నంద లవ్స్ నందిత' ద్వారా ఆమె వెండితెరకు పరిచయమైంది.

ఆ సినిమాలో ఆమె పాత్ర పేరు నందిత కావడంతో, అదే పేరును తన స్క్రీన్ నేమ్‌గా మార్చుకుంది. అనంతరం 2016లో విడుదలైన 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమాతో తెలుగులో మంచి విజయాన్ని అందుకుని, ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.

ఆ తర్వాత వరుసగా పలు తెలుగు చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను ఏర్పరుచుకుంది. సినిమాల్లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ భామ సోషల్ మీడియాలోనూ అదే జోరును కొనసాగిస్తోంది.

తాజాగా నందిత శ్వేత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని స్టైలిష్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. పొట్టి డ్రెస్‌లో ట్రెండీ లుక్‌తో మెరిసిన ఆమె, తన గ్లామరస్ స్టైల్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది.

మెడలో భారీ చైన్, డిఫరెంట్ డిజైన్‌లో ఉన్న ఉంగరం ఆమె లుక్‌కు మరింత ప్రత్యేక ఆకర్షణను తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, నెటిజన్ల నుంచి భారీ స్పందనను అందుకుంటున్నాయి.

Photos Courtesy: Instagram

Next Story