60 ఏళ్ల వయసులో ముచ్చటగా మూడోసారి.. పెళ్లి డేట్ ప్రకటించి షాకిచ్చిన ఆమిర్ ఖాన్

by Mallepaka Hamsa |

ఈ కొత్త ప్రయాణంలో అందరి ఆశీస్సులు తమకు కావాలని ఆయన కోరారు. తామిద్దరం ఎప్పుడూ సంతోషంగా ఉండేలా దీవించమని మీడియా ద్వారా అభిమానులను వేడుకున్నారు.

60 ఏళ్ల వయసులో ముచ్చటగా మూడోసారి.. పెళ్లి డేట్ ప్రకటించి షాకిచ్చిన ఆమిర్ ఖాన్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ బిగ్ షాకిచ్చారు. తాను ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుబోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. గతంలో రెండుసార్లు పెళ్లి కాగా.. వారితో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. గత కొద్ది కాలం నుంచి ఆయన గౌరీ స్ప్రాట్ అనే ఫ్యాషన్, స్టైలిష్ట్‌తో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరు పలు ఈవెంట్స్‌కు కూడా జంటగా హాజరవడంతో పాటుగా కొద్ది రోజుల క్రితమే తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా తన ప్రియురాలిని అందరికీ పరిచయం కూడా చేశారు. ఇక వీరి పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. తాజాగా, ఈ విషయంపై ఆమిర్ ఖాన్ రియాక్ట్ అయి షాకింగ్ న్యూస్ వెల్లడించారు. ముంబైలో జరిగిన రాజ్‌కుమార్ హిరాణీ సినిమా స్క్రీనింగ్ వేడుకలో పాల్గొన్న ఆయన మీడియాతో ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ.. అవును, తనకు జులై 5న పెళ్లి జరుగుతోందని చెప్పారు. అది చాలా చిన్న వేడుక అని, ఇంట్లోనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నామని అన్నారు. జులై 5 తమకు ఎంతో ప్రత్యేకమైన రోజని, కేవలం రెండు కుటుంబాలు, కొందరు అత్యంత ఆప్తమిత్రులు, చిన్ననాటి స్నేహితులు మాత్రమే ఈ పెళ్లికి హాజరవుతున్నారని వివరించారు.

ఈ కొత్త ప్రయాణంలో అందరి ఆశీస్సులు తమకు కావాలని ఆయన కోరారు. తామిద్దరం ఎప్పుడూ సంతోషంగా ఉండేలా దీవించమని మీడియా ద్వారా అభిమానులను వేడుకున్నారు. కాగా. ఆమిర్ ఖాన్‌కు ఇది మూడో పెళ్లి కావడం విశేషం. ఆయన మొదటిసారి 1986లో రీనా దత్తాను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరికి జునైద్ ఖాన్, ఐరా ఖాన్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కొద్ది కాలం వీరి కాపురం బాగానే ఉన్నప్పటికీ మనస్పర్థల కారణంగా వీరు 2002లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2005లో ప్రముఖ దర్శకురాలు కిరణ్ రావును ఆమిర్ రెండో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆజాద్ రావు ఖాన్ అనే కుమారుడు ఉన్నాడు. 16 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత, 2021లో వీరిద్దరూ కూడా విడిపోతున్నట్లు ప్రకటించారు. అయినప్పటికీ, కొడుకు బాధ్యతలను ఇద్దరూ కలిసి చూసుకుంటున్నారు. ఇక రెండోసారి విడాకులు అయ్యాక ఆమిర్ ఖాన్ గౌరీతో ప్రేమలో పడ్డారు. ఇక ఇప్పుడు 60 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించడం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయం తెలుసుకున్న వారంతా షాక్ అవుతున్నారు. మరికొందరు మాత్రం అప్పుడే కంగ్రాట్స్ చెబుతున్నారు.

Next Story