- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖరీఫ్ పై చిగురించిన ఆశలు..!
ఆలస్యంగా ప్రారంభమైన ఖరీఫ్ సీజన్‌కు ఇటీవల కురిసిన వర్షాలు కొత్త ఊపునిచ్చాయి.

దిశ, ఝరాసంగం: ఆలస్యంగా ప్రారంభమైన ఖరీఫ్ సీజన్‌కు ఇటీవల కురిసిన వర్షాలు కొత్త ఊపునిచ్చాయి. తొలుత తగినంత వర్షపాతం లేక రైతులు ఆందోళనకు గురైన గత పది రోజులుగా రెండు, మూడు దఫాలుగా కురిసిన వర్షాలతో పంటల సాగు వేగం పుంజుకుంది. దీంతో సీజన్‌పై రైతుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని 33 గ్రామ పంచాయతీల పరిధిలో వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం.. సుమారు 40 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కానున్నాయి. ఇప్పటికే దాదాపు 35 వేల ఎకరాల్లో పత్తి, సోయాబీన్, కంది, పెసర, మినుము తదితర వర్షాధార పంటల విత్తనాలు వేశారు.
బర్దిపూర్, చిలపల్లి, కుప్పానగర్, పొట్టిపల్లి, తుమ్మలపల్లి, దేవరంపల్లి, ఏడాకులపల్లి, సిద్దాపూర్, వనంపల్లి తదితర గ్రామాల్లో "దిశ " క్షేత్రస్థాయిలో పరిశీలించగా రైతులు పొలాల్లో సాగు పనులతో తీరిక లేకుండా కనిపించారు. కొన్ని ప్రాంతాల్లో పత్తి పంటకు మొదటి విడత మందుల పిచికారీ చేపడుతుండగా, పిచ్చి మొక్కలు కలుపు పనులు మరికొన్ని చోట్ల ఇంకా విత్తనాలు వేస్తూ రైతులు నిమగ్నమయ్యారు. మొలకెత్తిన పంటలు పచ్చదనాన్ని సంతరించుకోవడంతో రైతుల్లో ఆశావహ వాతావరణం నెలకొంది. మంచి దిగుబడుల పై ఆశలు రాబోయే రోజుల్లో కూడా అనుకూలంగా వర్షాలు కురిసి, పంటలు సక్రమంగా ఎదిగి రైతులకు మంచి దిగుబడులు, గిట్టుబాటు ధరలు లభించాలని రైతులు ఆకాంక్షిస్తున్నారు.






