- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాగార్జున చెక్కిన 'లెనిన్'.. ఈసారి హిట్ గ్యారెంటీ అంటారా?
'లెనిన్' సినిమా కోసం నాగార్జున ఎడిట్ రూమ్‌లో ప్రతి అంశాన్ని స్వయంగా పరిశీలించి సూచనలు చేశారని అఖిల్ వెల్లడించాడు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున వారసుల్లో ఒకరైన అఖిల్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పటికే చాలా సంవత్సరాలు అయింది. అయితే ఇప్పటివరకు ఆయనకు కెరీర్‌ను మలుపుతిప్పే స్థాయి సాలిడ్ విజయం మాత్రం దక్కలేదు. దీంతో అక్కినేని అభిమానులు ఎప్పటి నుంచో అఖిల్‌కు ఓ భారీ హిట్ రావాలని ఎదురుచూస్తున్నారు. తాజాగా అఖిల్ హీరోగా నటించిన 'లెనిన్' చిత్రం జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి నిర్మాతల్లో నాగార్జున కూడా ఒకరు కావడంతో, ఈ సినిమాపై ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని, అఖిల్‌కు మంచి విజయం అందించేందుకు తనవంతు కృషి చేశారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా అఖిల్ చేసిన వ్యాఖ్యలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేశాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అఖిల్ మాట్లాడుతూ.. "నాగార్జున గారు ఈ సినిమాకు నిర్మాతగా మాత్రమే కాకుండా ప్రతి విషయంలో ఎంతో శ్రద్ధ చూపించారు.
సినిమా పూర్తయ్యాక ఎడిట్ రూమ్‌లో చాలా సార్లు చూసి, ఎక్కడ క్లోజ్‌అప్ ఉండాలి, ఎక్కడ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రావాలి వంటి ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి సూచనలు చేశారు" అని తెలిపారు. దీంతో అక్కినేని అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా అఖిల్‌కు ఈ సినిమాతో విజయాన్ని అందించేందుకు నాగార్జున ఎంతో కృషి చేసినట్లు అభిప్రాయపడుతున్నారు. ఈసారి అఖిల్‌కు విజయావకాశాలు బాగానే ఉన్నాయని భావిస్తున్నారు. మరి 'లెనిన్' చిత్రంతో అఖిల్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. ఇక ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. నాగార్జునతో పాటు సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.






