- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పార్వతి కథలో తన సీన్లు ఎంత ఉన్నాయని చూడదు ఆమె ఆలోచలన్నీ వేరు: పృథ్వీరాజ్ సుకుమారన్
ఆమె ఒక కథను ఎంచుకునేటప్పుడు అందులో తన పాత్ర ఎంత పెద్దది అని మాత్రమే చూడరని, ఆ కథకు ఒక మంచి సినిమాగా మారే సత్తా ఉందా లేదా అని ఆలోచిస్తారని చెప్పారు.

దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, పార్వతి తిరువోతు జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఐ నోబడీ’. ఎన్ను నింటే మొయిదీన్’, ‘కూడే’ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. నిజామ్ బషీర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను బ్యాంక్ దోపిడీ నేరం మోపబడి, కష్టాలను ఎదుర్కొనే ఒక వ్యక్తి కథ ఆధారంగా రూపొందించారు. అయితే ఈ సినిమాకు జేమ్స్ బిజోయ్ సంగీతం అందించగా.. షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని జూలై 9న థియేటర్స్‌లోకి తీసుకురాబోతున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, ప్రమోషన్స్‌లో పాల్గొన్న పృథ్వీరాజ్ సుకుమారన్ నటి పార్వతి తిరువోతుపై ప్రశంసలు కురిపించారు. పార్వతి కేవలం నటనకు మాత్రమే పరిమితం కాకుండా, సినిమాను చాలా లోతుగా అర్థం చేసుకునే ఒక తెలివైన నటి అని పృథ్వీరాజ్ కొనియాడారు.
ఆమె ఒక కథను ఎంచుకునేటప్పుడు అందులో తన పాత్ర ఎంత పెద్దది అని మాత్రమే చూడరని, ఆ కథకు ఒక మంచి సినిమాగా మారే సత్తా ఉందా లేదా అని ఆలోచిస్తారని చెప్పారు. ఆ సినిమాలో తాను భాగం కావడం వల్ల ఆ చిత్రానికి మరింత బలం చేకూరుతుందని ఆమె నమ్ముతారని పృథ్వీరాజ్ వివరించారు. పార్వతి క్రియేటివ్ ఆలోచనలపై తనకు పూర్తి నమ్మకం ఉందని పృథ్వీరాజ్ చెప్పారు. తనకు ఆమె చాలా కాలంగా తెలుసని, సినిమాపై ఆమెకున్న అవగాహన చూస్తుంటే భవిష్యత్తులో ఆమె ఒక అద్భుతమైన దర్శకురాలవుతుందని తాను ఖచ్చితంగా నమ్ముతున్నానని అన్నారు. చాలా ఏళ్లుగా కలిసి నటిస్తున్న వీరిద్దరి మధ్య ఉన్న పరస్పర గౌరవం, స్నేహం పృథ్వీరాజ్ మాట్లాడిన మాటల్లో స్పష్టంగా కనిపించింది. అయితే ఈ సినిమాతో పాటు పార్వతి బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌తో కలిసి అమెజాన్ ప్రైమ్ నిర్మిస్తున్న ‘స్టార్మ్’ అనే సిరీస్‌లో కూడా నటిస్తున్నారు.






