- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. రూ.105 కోట్లతో ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణం
దేశ రాజధాని ఢిల్లీలో రూ.105 కోట్ల వ్యయంతో సరికొత్త ఏపీ భవన్ నిర్మాణానికి సర్కారు పచ్చజెండా ఊపింది.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం దేశ రాజధాని ఢిల్లీలోని పాత ఏపీ భవన్ ఆస్తుల పంపకం ఇప్పటికే పూర్తి అయింది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం తమకు కేటాయించి స్థలంలో అత్యాధునిక హంగులతో 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ.105 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించినట్లుగా అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ భవనం దేశ రాజధానిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన పరిపాలన, అత్యున్నత స్థాయి ఆతిథ్య కేంద్రంగా (Hospitality Center) సేవలందించనుంది.
NBCCకి నిర్మాణ బాధ్యతలు..
అయితే, కొత్త ఏపీ భవన్ భవన నిర్మాణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ (NBCC)కి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించారు. ప్రభుత్వ నిర్మాణాల్లో అత్యంత నాణ్యత, పారదర్శకతను పాటించే ట్రాక్ రికార్డ్ ఉన్నందున, నిర్ణీత కాలవ్యవధిలో ప్రాజెక్టును పూర్తి చేసేందుకు వీలుగా NBCCకి బాధ్యతలను కట్టబెట్టినట్లుగా తెలుస్తోంది. ఇక నుంచి హస్తినకు వచ్చే ఏపీ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు అన్ని వసతులు ఒకేచోట దొరికేలా, అలాగే ఏపీ సంస్కృతి ప్రతిబింబించేలా భవన డిజైన్లను రూపొందించారు. అతి త్వరలోనే నూతన భవన నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతలు మీదుగ జరగనుంది.






