- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాదచారులపైకి దూసుకెళ్లిన ప్రైవేటు బస్సు.. స్పాట్‌లోనే ఇద్దరు యువకులు దుర్మరణం
నెల్లూరు జిల్లా కోట మండలం చంద్రశేఖరపురం వద్ద ఘోర ప్రమాదం జరిగింది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రైవేటు బస్సు బీభత్సం సృష్టించిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కోట మండల పరిధిలోని చంద్రశేఖరపురం వద్ద నియంత్రణ కోల్పోయిన బస్సు.. ముందుగా ఉన్న ఆటోను బలంగా ఢీకొట్టి, ఆపై రోడ్డు పక్కన ఉన్న దుకాణాలు, పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘోర దుర్ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను కేశవరం గ్రామానికి చెందిన శివ (22), వంజివాక గ్రామానికి చెందిన వినోద్ (21)గా గుర్తించారు.
కాగా, ఒకేసారి ఇద్దరు యువకులు ఇలా అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడంతో వారి స్వగ్రామాల్లో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. అయితే, ప్రమాదానికి కారణమైన బస్సు స్థానిక ‘గాయత్రి రొయ్యల కంపెనీ’ (Gayatri Prawns Company)కి చెందినదిగా గుర్తించారు. బస్సు మితిమీరిన వేగంతో రావడం వల్లే డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని, ఆటోను ఢీకొట్టిన తర్వాత కూడా వేగం తగ్గకపోవడంతో నేరుగా దుకాణాల వైపు దూసుకువచ్చిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అదేవిధంగా ప్రమాదంలో గాయపడిన ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు, పోలీసులు కలిసి వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కోట పోలీసులు స్పాట్‌కు స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్రేన్ సాయంతో బస్సును, ధ్వంసమైన ఆటోను రోడ్డుపై నుంచి తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. మృతుల కుటుంబాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.






