ఏ క్యారెక్టర్ చేయడానికైనా సిద్ధమే.. స్టార్ నటి

by Disha Web |
ఏ క్యారెక్టర్ చేయడానికైనా సిద్ధమే.. స్టార్ నటి
X

దిశ, సినిమా: ప్రముఖ నటి స్వరా భాస్కర్‌ తన నటనా జీవితం గురించి ఆసక్తికర విషయాలు తెలిపింది. బిగ్ స్టార్లు రిజెక్ట్ చేసిన కొన్ని పాత్రలు తన కెరీర్‌లో అత్యంత ప్రజాదరణ పొందినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఈ మేరకు 'రాంజనా', 'ప్రేమ్‌ రతన్ ధన్‌ పాయో' వంటి చిత్రాల్లో తాను చేసిన క్యారెక్టర్లు ముందు వేరే నటీమణులకోసం ప్రిపేర్ చేశారన్న నటి.. వాళ్లు ఆఖరి నిమిషంలో రిజెక్ట్ చేయడంతో తను నటించే అవకాశం లభించిందని వివరించింది. అలాగే తనకు ఏ ఆఫర్ వచ్చిన చేయడానికి సిద్ధంగా ఉంటానన్న స్వరా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో అనే టెన్సన్ పెట్టుకోనని చెప్పడం విశేషం. కాగా తన కెరీర్ మొత్తంలో ఎక్కువ శాతం ఇతరులు తిరస్కరించిన క్యారెక్టర్లే తనను ఈ స్థాయికి తీసుకొచ్చాయని గర్వంగా చెప్పుకుంటోంది స్వరా భాస్కర్.


దేవుడే నాతో అలా మాట్లాడించాడు.. మాజీ మిస్ యూనివర్స్




Next Story

Most Viewed