మహిళలపై చేసిన దాడికి స్వామీ దాస్ బదిలీ..

by Vinod kumar |

దిశ, గోదావరిఖని: అర్జీ-1 పరిధిలోని వర్క్ - Swami Das transferred for sexually harassing and threatening a woman

మహిళలపై చేసిన దాడికి స్వామీ దాస్ బదిలీ..
X

దిశ, గోదావరిఖని: అర్జీ-1 పరిధిలోని వర్క్ షాప్ లో ఓ మహిళను లైంగిక వేధింపులకు గురి చేస్తు బెదిరింపులకు పాల్పడిన స్వామీ దాస్ పై వేటు పడినట్లు సమాచారం. సింగరేణి యాజమాన్యంపై తీవ్ర ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఎట్టకేలకు స్పందించిన అధికారులు సదరు నాయకుడిని మణుగూరులోని సత్తుపల్లికి బదిలీ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే సదరు నాయకుడు వర్క్ షాప్ లో ఓ మహిళను లైంగికంగా వేధింపులకు గురి చేయడమే కాకుండా.. తోటి కార్మికులను ఇబ్బందులకు గురి చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం స్వామీ దాస్ తనపై దాడి చేయించాడని సదరు మహిళ వర్క్ షాప్ ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా.. అది సింగరేణి వ్యాప్తంగా కలకలం సృష్టించింది. సదరు మహిళకు కార్మిక సంఘాల నేతలతో పాటు కార్మికులు కూడా మద్దతు ప్రకటించడం తో ఎట్టకేలకు సదరు నాయకుడిని అధికారులు బదిలీ చేశారు.

Next Story