- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫార్మసీ విద్యార్థి అనుమానాస్పద మృతి! గోప్యంగా ఉంచిన కళాశాల యాజమాన్యం
దిశ, హన్మకొండ టౌన్: కళాశాల వసతి గృహ భవనంపై నుండి పడి ఓ విద్యార్థి మృతి చెందాడు.- latest Telugu news

X
దిశ, హన్మకొండ టౌన్: కళాశాల వసతి గృహ భవనంపై నుండి పడి ఓ విద్యార్థి మృతి చెందాడు. వివరాల ప్రకారం.. హన్మకొండలోని చైతన్య ఫార్మసీ కళాశాలలో రబిహుల్ ఖాన్ అనే విద్యార్థి శుక్రవారం కళాశాల వసతి భవనం 3వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. గమనించిన స్నేహితులు హుటాహుటిన క్షతగాత్రుడిని వరంగల్ ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ రబిహుల్ ఖాన్ మృతి చెందాడు. ఎంజీఎం మార్చురీలో మృతదేహాన్ని భద్రపర్చారు. మృతి చెందిన విద్యార్థి స్వస్థలం పశ్చిమ బెంగాల్‌గా తెలుస్తోంది. రబీహుల్ ఖాన్ మృతి వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదవశాత్తు జరిగిందా? ఎవరైనా కావాలనే తోసేశారా ? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Next Story






