- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తీవ్ర విషాదం.. లండన్‌లో తెలంగాణ యువకుడి అనుమానాస్పద మృతి
ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన రాజంపేట మండలం తలమడ్ల గ్రామానికి చెందిన సావుసాని శ్రీనాథ్ రెడ్డి (25) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

దిశ, రాజంపేట్: ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన రాజంపేట మండలం తలమడ్ల గ్రామానికి చెందిన సావుసాని శ్రీనాథ్ రెడ్డి (25) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తలమడ్ల గ్రామానికి చెందిన సాహసాని మధుసూదన్ రెడ్డి- మంజుల దంపతుల కుమారుడు సావుసాని శ్రీనాథ్ రెడ్డి గత సంవత్సరం ఎంఎస్ చదవడానికి లండన్ వెళ్ళాడు. అక్కడ లేయిసిస్టర్ పట్టణంలోని యూనివర్సిటీలో ఎంఎస్ మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఎం.ఎస్ పూర్తిచేసుకొని భవిష్యత్తులో మెరుగైన అవకాశాలు అందిపుచ్చుకొని తల్లిదండ్రులతో ఆనందంగా గడపాలని తను కన్న కలలన్నీ ఒక్కసారిగా ఆవిరి అయిపోయాయి.
ఈనెల 22న రాత్రి స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా విందుకు హాజరై తిరిగి తన రూమ్ లోకి వచ్చి నిద్రపోయాడు. ఉదయం రూమ్‌లో నిద్రిస్తున్న శ్రీనాథ్‌ను తన రూమ్ స్నేహితుడు వచ్చి చూడగా మృతి చెంది ఉన్నాడు. ఈ విషయాన్ని లండన్ లో ఉంటున్న శ్రీనాథ్ బంధువులకు తెలియజేయగా వారు తలమడ్లలోని కుటుంబ సభ్యులకు తెలిపారు. ఎంతో కష్టపడి కామారెడ్డిలో ఇంటర్, హైదరాబాద్ లో డిగ్రీ పూర్తి చేసుకొని ఎంఎస్ చదవడానికి లండన్ వెళ్లి చివరి చూపు చూడడానికి కూడా వీల్లేకుండా చిన్న వయసులోనే కానరాని లోకాలకు వెళ్లాడని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో తేలిపోయారు. ఈ విషాదంతో గ్రామంలో కారు చీకటి అలుముకుంది. శ్రీనాథ్ రెడ్డి పార్థివ దేహాన్ని శుక్రవారం పోస్టుమార్టం అయిన తర్వాత స్వగృహం తీసుకురావడానికి ప్రవాస భారతీయులు, కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు.






