Krishna Bhagavan: రవితేజ, వేణు నా రూమ్‌మేట్స్.. రాత్రిపూట మేమంతా అలాంటి పని చేసేవాళ్లం

by Pulgam srinivas |

ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తాను, రవితేజ, వేణు తోట్టెంపూడి, వైవీఎస్ చౌదరి ఒకే గదిలో కలిసి ఉండేవాళ్లమని కృష్ణ భగవాన్ తెలిపారు.

Krishna Bhagavan: రవితేజ, వేణు నా రూమ్‌మేట్స్.. రాత్రిపూట మేమంతా అలాంటి పని చేసేవాళ్లం
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్‌లో మంచి గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటుల్లో కృష్ణ భగవాన్ ఒకరు. తనదైన కామెడీ టైమింగ్‌తో ఎన్నో చిత్రాల్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ప్రస్తుతం సినిమాల్లో ఎక్కువగా కనిపించకపోయినా, జబర్దస్త్ షోకు జడ్జిగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృష్ణ భగవాన్ తన కెరీర్ ప్రారంభ రోజులకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. "ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నేను, రవితేజ, వేణు తోట్టెంపూడి, వైవీఎస్ చౌదరి ఒకే గదిలో ఉండేవాళ్లం. మాకు గది అద్దెకు ఇచ్చిన ఓనర్‌కు కుక్కలంటే ఎంతో ఇష్టం. ఆయన ఎన్నో రకాల కుక్కలను పెంచుతూ, వాటికి శిక్షణ కూడా ఇచ్చేవారు. అయితే మేము సినిమా పనుల వల్ల తరచూ రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చేవాళ్లం. మాకు కుక్కలంటే చాలా భయం ఉండటంతో,చాలాసార్లు గోడ దూకి ఇంట్లోకి వెళ్లేవాళ్లం. అలా ఆ రోజులు చాలా సరదాగా గడిచాయి" అని కృష్ణ భగవాన్ తెలిపారు.

Next Story