పాల్వంచ బస్టాండ్ వద్ద గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం

by Jakkula.Mamatha |

పట్టణంలోని పాల్వంచ బస్టాండ్ ఔట్‌గేట్ సమీపంలో శుక్రవారం ఓ గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైనట్లు పాల్వంచ టౌన్ పోలీసులు తెలిపారు.

పాల్వంచ బస్టాండ్ వద్ద గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం
X

దిశ, పాల్వంచ టౌన్: పట్టణంలోని పాల్వంచ బస్టాండ్ ఔట్‌గేట్ సమీపంలో శుక్రవారం ఓ గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైనట్లు పాల్వంచ టౌన్ పోలీసులు తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 60 నుంచి 65 సంవత్సరాల మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఆయన ఎత్తు సుమారు ఐదు అడుగులు ఉండగా, చామనఛాయ రంగు కలిగి ఉన్నారు. మృతుడు ఎరుపు రంగు టీ-షర్ట్, నీలం రంగు లుంగీ ధరించి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుడిని ఎవరైనా గుర్తించినా, ఆయనకు సంబంధించిన వివరాలు తెలిసిన వెంటనే పాల్వంచ టౌన్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ఎస్‌హెచ్‌ఓ విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించేందుకు 8712682051, 8712682050, 9701249654 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు. గుర్తుతెలియని మృతుని వివరాలు గుర్తించేందుకు ప్రజలు సహకరించాలని పోలీసులు కోరారు.

Next Story