- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘‘జీవితంలో సంతోషంగా ఉండటానికి భర్తపై ఆధారపడకండి’’.. శోభితకు కౌంటర్ ఇచ్చిన సమంత!
ఒక బంధం సక్సెస్ అవ్వాలంటే ఇద్దరు వ్యక్తులు కష్టపడాలని, అందుకే ఒక మహిళగా తనపై తనకు నమ్మకం ఉండాలని, ఒంటరిగా ఉన్నా తను పర్ఫెక్ట్ అనిపించుకోవాలని సమంత స్పష్టం చేశారు.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చాలా కాలం తర్వాత ‘మా ఇంటి బంగారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ విడుదలైన ఫస్ట్ షో నుంచి బ్లా్క్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. అంతేకాకుండా భారీ బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా, ఈ మూవీ సక్సెస్ ఈవెంట్‌లో పాల్గొన్న సమంతకు ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది... మగాళ్లను ఎంచుకునే విషయంలో అమ్మాయిలు చాలాసార్లు తడపడుతున్నారు అని ఓ రిపోర్టర్ అడగ్గా.. దానికి సమంత స్పందిస్తూ.. కెరీర్, రిలేషన్స్, ఆడవాళ్లకు ఉండాల్సిన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు. ఆడవాళ్లు తాము లైఫ్‌లో హ్యాపీగా, పర్ఫెక్ట్‌గా ఉండటానికి మగవారిపై లేదా తమ పార్ట్‌నర్‌పై ఆధారపడకూడదని సమంత అన్నారు. కెరీర్, బంధాలు అనేవి మన చేతుల్లోనే ఉంటాయని.. కానీ కొన్నిసార్లు రిలేషన్స్ చాలా కాంప్లికేటెడ్‌గా మారి మన కంట్రోల్‌లో ఉండవని చెప్పారు.
ఒక బంధం సక్సెస్ అవ్వాలంటే ఇద్దరు వ్యక్తులు కష్టపడాలని, అందుకే ఒక మహిళగా తనపై తనకు నమ్మకం ఉండాలని, ఒంటరిగా ఉన్నా తను పర్ఫెక్ట్ అనిపించుకోవాలని సమంత స్పష్టం చేశారు. వేరే ఎవరో వచ్చి మన జీవితాన్ని పూర్తి చేస్తారని ఎదురుచూడటం వల్ల బంధాలపై అనవసరమైన భారం పడుతుందని సమంత వివరించారు. ఎప్పటికైనా మనకు నచ్చిన కరెక్ట్ వ్యక్తి దొరుకుతాడని.. కానీ ఎవరైనా వచ్చి మనల్ని పూర్తి చేయాలని చూస్తే మాత్రం ఆ బంధం అస్సలు సాగదని, ఎందుకంటే అవతలి వ్యక్తిపై అంచనాలు పెరిగిపోతాయని, అది కరెక్ట్ కాదని సమంత చెప్పుకొచ్చారు. సమంత ఈ ఇంటర్వ్యూలో ఎవరి పేరు కూడా డైరెక్ట్‌గా ఎత్తలేదు. కానీ నెటిజన్లు మాత్రం రకరకాలుగా చర్చించుకుంటున్నారు.
కొందరు సమంతను తిడుతుంటే.. మరికొందరు మాత్రం నాగచైతన్య తనను పూర్తి చేయడానికి చూశాడని అందుకే విడాకులు తీసుకుందని అంటున్నారు. అంతేకాకుండా శోభితా ధూళిపాళ్ల పెళ్లి వీడియో మాటలతో లింక్ పెడుతున్నారు. శోభిత తన వెడ్డింగ్ వీడియోలో మాట్లాడుతూ.. మనుషులం ఒంటరిగా ఉన్నా బానే ఉంటామని, కానీ నాగచైతన్య తన జీవితంలో లేకపోతే తాను పూర్తిగా ఉండలేనని, ఆయన తన జీవితంలోకి వచ్చి ఆ వెలితిని పూరించాడని చెప్పారు. శోభిత అన్న ‘ఆయన నన్ను పూర్తి చేశాడు’ అనే మాటకు కౌంటర్‌గానే సమంత ఇప్పుడు ‘ఎవరి కోసమో చూడకండి, మిమ్మల్ని మీరే పూర్తి చేసుకోండి’ అని మాట్లాడిందని సోషల్ మీడియాలో అనుకుంటున్నారు. అయితే సమంత ఈ కామెంట్స్ జనరల్‌గా చెప్పిందా? లేక శోభితకే కౌంటర్ ఇచ్చిందా? అనే విషయం చర్చకు దారితీసింది.






