- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళల ఆత్మగౌరవానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట
మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు.

దిశ, తుర్కయంజాల్ : మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. శుక్రవారం ఆదిభట్ల సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన మన్నెగూడలోని జేఏఎంఆర్ గార్డెన్‌లో నిర్వహించిన ఇందిరమ్మ మహిళా శక్తి కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులకు, మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళల సంక్షేమం, ఆర్థిక సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతతో పనిచేస్తోందన్నారు. ప్రతి అర్హులైన మహిళకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మహిళా సంఘాలను మరింత బలోపేతం చేసి స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీ పీ సీ సీ కార్యదర్శి కొత్త కురుమ శివ కుమార్, తొర్రూరు డివిజన్ అధ్యక్షులు కోశిక ఐలయ్య, తుర్కయంజాల్ డివిజన్ అధ్యక్షులు ఓర్సు శ్రీనివాస్, మాజీ వైస్ చైర్మన్ గండ్లపల్లి హరిత ధనరాజ్ గౌడ్, సీనియర్ నాయకులు సామ భీం రెడ్డి, మర్రి మహేందర్ రెడ్డి, కొంతం వెంకట్ రెడ్డి, మేతరి దర్శన్, నక్క శివలింగం గౌడ్, మెప్మా యూ సీ డీ అశ్వినీ, మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






