- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇక టెక్ట్స్ మెసేజ్‌లకు కూడా ‘View Once’!
ప్రస్తుతం ఫొటోలు, వీడియోలకు మాత్రమే అందుబాటులో ఉన్న ‘వ్యూ వన్స్’ ఫీచర్ త్వరలో టెక్స్ట్ మెసేజ్‌లకు సైతం వర్తించనుంది.

దిశ, ఫీచర్స్ : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఏమిటంటే.. ఈ ప్లాట్‌ఫామ్ తన ప్రముఖ ‘View Once’ ఫీచర్‌ను ఇప్పుడు సాధారణ టెక్స్ట్ మెసేజ్‌లకు కూడా విస్తరించేందుకు పనిచేస్తున్నది. అయితే వాట్సాప్ దీనిని అధికారికంగా ప్రకటించలేదు కానీ.. నివేదికల ప్రకారం అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. వాటి ప్రకారం.. ప్రస్తుతం ఫొటోలు, వీడియోలకు మాత్రమే అందుబాటులో ఉన్న ‘వ్యూ వన్స్’ ఫీచర్ త్వరలో టెక్స్ట్ మెసేజ్‌లకు సైతం వర్తించనుంది. అదే జరిగితే.. ఇక నుంచి మీరు పంపిన వాట్సాప్ మెసేజ్ రిసీవర్ చదివిన తర్వాత ఆటోమేటిగ్గా అదృశ్యం అవుతుంది. పైగా ఈ ఇది సెన్సిటివ్ & పర్సనల్ లేదా రహస్య సంభాషణలకు సంబంధించి అదనపు భద్రతను కూడా కల్పిస్తుంది.
టెక్స్ట్‌లకు సైతం వర్తింపజేసే వ్యూ వన్స్ (View Once) ఫీచర్‌తో పంపిన మెసేజ్‌ను అవతలి వ్యక్తి.. అంటే.. రిసీవర్ సేవ్ చేయడం గానీ, ఫార్వర్డ్ చేయడం గానీ, స్క్రీన్‌షాట్ తీసుకోవడం గానీ చేయలేరు. ఇది యూజర్లకు తమ చాట్‌లపై మరింత నియంత్రణను అందిస్తుంది. అయితే ఈ ఫీచర్ ఇంకా డెవలప్‌మెంట్ దశలో ఉందని, భవిష్యత్ అప్‌డేట్‌లో ఎప్పుడైనా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. మొత్తానికి ఈ సరికొత్త మార్పు వాట్సాప్‌కు సంబంధించిన ప్రైవసీ ఫీచర్లలో ఇటీవలి కాలంలో అత్యంత ముఖ్యమైన అప్‌డేట్‌లలో ఒకటిగా మారవచ్చు.
*గమనిక: ఇది ప్రస్తుతం పబ్లిక్ రిపోర్టుల ఆధారంగా ఉన్న సమాచారం మాత్రమే. అధికారికంగా వాట్సాప్ ఇంకా ధృవీకరించలేదు.






