జిల్లాలో యూరియా కొరత లేదు..

by Taduka Kalyani |

జిల్లాలో యూరియా కొరత లేదు. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటి అన్నారు.

జిల్లాలో యూరియా కొరత లేదు..
X

దిశ, వాంకిడి : జిల్లాలో యూరియా కొరత లేదు. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటి అన్నారు. శుక్రవారం వాంకిడి మండలంలోని శ్రీ వెంకటేశ్వర ట్రేడర్స్ ఫెర్టిలైజర్ షాపును ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. షాప్ లోని విత్తనాలు, ఎరువుల స్టాక్ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు విక్రయించాలన్నారు. అలాగే షాప్ లో ఉన్న ఎరువులు, విత్తనాలు స్టాక్ వివరాలను ఎప్పటికప్పుడు రైతులకు తెలిసేలా బయట నోటీసు బోర్డు పై రాసి పెట్టాలని సూచించారు. పాటించకుండా అధిక ధరలకు ఎరువులు విక్రయించే ఫర్టీలైజర్ షాపుల పై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అలాగే విత్తనాలు ఎరువులు కొనుగోలు చేసిన రైతులు సదరు షాపుల నుండి రసీదు తీసుకోవాలని రైతులకు ఆయన సూచించారు.

Next Story