నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతిని ‘ఆల్ఫా’ సినిమా ఇచ్చింది: ఆలియా భట్

by Mallepaka Hamsa |

ఒకరోజు ఫైట్ సీక్వెన్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో తన టైమింగ్ మిస్ అయ్యి అనుకోకుండా ఫైట్ కొరియోగ్రాఫర్‌ను గట్టిగా కొట్టేశానని ఆమె గుర్తు చేసుకున్నారు.

నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతిని ‘ఆల్ఫా’ సినిమా ఇచ్చింది: ఆలియా భట్
X

దిశ, సినిమా: శివ్ రావేల్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ ప్రాజెక్ట్ ‘ఆల్ఫా’. ఇందులో ఆలియా భట్, శార్వరి వాఘ్, బాబీ డియోల్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో వస్తున్న మొదటి ఫిమేల్ ఓరియంటెడ్ స్పై ఫిల్మ్ కావడంతో ‘ఆల్ఫా’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై 3న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈనేపథ్యంలో.. ప్రమోషన్స్ జోరు పెంచిన ఆలియా భట్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సినిమాలో ఆలియా భట్ మునుపెన్నడూ లేని విధంగా భారీ యాక్షన్ సీక్వెన్స్‌లలో నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ యాక్షన్ సీన్స్ అన్నీ స్క్రీన్‌పై చాలా రియలిస్టిక్‌గా కనిపించడం కోసం తాము చాలా రోజులు కష్టపడి ప్రాక్టీస్ చేశామని ఆలియా చెప్పారు.

ఒకరోజు ఫైట్ సీక్వెన్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో తన టైమింగ్ మిస్ అయ్యి అనుకోకుండా ఫైట్ కొరియోగ్రాఫర్‌ను గట్టిగా కొట్టేశానని ఆమె గుర్తు చేసుకున్నారు. అది చూసి తానే షాక్ అయ్యానని, వెంటనే అతనికి సారీ కూడా చెప్పానని ఆలియా వివరించారు. తన వల్ల ఒకరికి దెబ్బ తగిలినందుకు చాలా బాధ కలిగిందని ఆలియా ఎమోషనల్ అయ్యారు. అది కావాలని చేసింది కాకపోయినా.. తన వల్ల ఒక వ్యక్తికి దెబ్బ తగలడం తనను చాలా కుంగిపోయేలా చేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. షూటింగ్ అయిపోయినా కూడా ఇప్పటికీ ఆ సీన్ గుర్తొచ్చినప్పుడల్లా తనకు మనసులో చాలా బాధగా అనిపిస్తుందని ఆలియా చెప్పుకొచ్చారు. అలాగే ఈ సినిమాలో యాక్షన్ కొరియోగ్రఫీ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందని అన్నారు. తన లైఫ్‌లోనే ఎప్పటికీ మర్చిపోలేని ఒక మంచి అనుభూతిని ‘ఆల్ఫా’ సినిమా తనకు ఇచ్చిందని ఆలియా సంతోషం వ్యక్తం చేశారు.

Next Story