- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మద్యంమత్తులో వినుకొండ డిపో కండక్టర్ వీరంగం.. ప్రయాణికుల ఆగ్రహం
వినుకొండ డిపోకు చెందిన ఆర్టీసీ కండక్టర్ మద్యం మత్తులో బస్సులోనే హల్ చల్ చేశారు. డ్యూటీలో ఉండి కూడా బాధ్యతను మరచిపోయారు. ....

దిశ, వెబ్ డెస్క్: వినుకొండ డిపోకు చెందిన ఆర్టీసీ కండక్టర్ మద్యం మత్తులో బస్సులోనే హల్ చల్ చేశారు. డ్యూటీలో ఉండి కూడా బాధ్యతను మరచిపోయారు. సిగరెట్ తాగుతూ ప్రశ్నించిన ప్రయాణికులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు, వృద్ధులను నోటికి వచ్చినట్లు బూతులు తిట్టారు. దీంతో కండక్టర్ ప్రవర్తనపై ప్రయాణికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజా రవాణా సంస్థలో ఇలాంటి బాధ్యతారాహిత్యం ఏంటని నిలదీశారు.
సోషల్ మీడియాలో కండక్టర్ వీరంగం దృశ్యాలు
అంతేకాదు ఈ దృశ్యాలను కొందరు ప్రయాణికులు తమ ఫోన్లలో చిత్రీకరించారు. ఈ కండక్టర్‌పై ఆర్టీసీ ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కండర్ సృష్టించిన వీరంగం దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు కూడా కండక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మద్యంమత్తులో దర్జాగా సిగరేట్ తాగుతూ ఆర్టీసీ కండక్టర్ చేసిన హల్ చల్‌పై అధికారుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.






