రోడ్డు వేయాలని కాంగ్రెస్ నాయకులకు వినతిపత్రం అందజేసిన పలు కాలనీవాసులు

by Kodari Anjali |

తదితర కాలనీవాసులు సంయుక్తంగా మల్కాజ్గిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి తోట లక్ష్మీకాంతరెడ్డికి వినతి పత్రం అందజేశారు.

రోడ్డు వేయాలని కాంగ్రెస్ నాయకులకు వినతిపత్రం అందజేసిన పలు కాలనీవాసులు
X

దిశ, అల్వాల్: 195 డివిజన్ కానాజిగూడ లోనీ నాగిరెడ్డి కాలనీ నుండి బీహెచ్ఈఎల్ కాలనీ వరకు రోడ్డు వేయాలని నాగిరెడ్డి కాలనీవాసులు లక్ష్మమ్మ ఎంక్లేవ్, రంగదామా కాలనీ, ఎం ఈ ఎస్ తదితర కాలనీవాసులు సంయుక్తంగా మల్కాజ్గిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి తోట లక్ష్మీకాంతరెడ్డికి వినతి పత్రం అందజేశారు. మామూలు సమయంలోనే రోడ్డుపై నడవాలంటే ఇబ్బందిగా ఉందని వర్షాకాలంలో మరింత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. రాకపోకలకు ఎన్నో అవస్థలకు గురికావాల్సి వస్తుందని వారు వెల్లడించారు. మైనంపల్లి ఆదేశానుసారం అధికారులతో చర్చించి పరిష్కార దిశగా ముందుకు సాగుతామని లక్ష్మీకాంత్ రెడ్డి కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏ బ్లాక్ అధ్యక్షుడు శేఖర్, డివిజన్ అధ్యక్షుడు మల్లెల శివ, మంద బాలకృష్ణారెడ్డి, నిమ్మ అశోక్ రెడ్డి, కృష్ణ గౌడ్ దేవేందర్, వెంకట్రావు నాగేశ్వరరావు, భాస్కర్, సంజీవ్ కుమార్, బబిత, లావణ్య నిర్మల విజయ, కాలనీవాసులు రవికాంత్, అజయ్ కుమార్, ఉమామహేశ్వరరావు, చిరంజీవి, సుధాకర్ రెడ్డి, వెంకటేష్, మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.

Next Story