- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అయోధ్య రామమందిర విరాళాల చోరీ కేసు.. నిందితులకు రిమాండ్
అయోధ్య రామమందిర విరాళాల చోరీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: అయోధ్య రామమందిర విరాళాల చోరీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టైన 8 మంది నిందితులను పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టగా.. వారందరికీ కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. రామశంకర్ యాదవ్ అలియాస్ టిన్ను, మనీష్ యాదవ్, లవ్ కుష్ మిశ్రా, కరుణేష్ పాండే, రమా శంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ, అనుకల్ప్ మిశ్రా, అవినాష్ శుక్లాలకు మూడు రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో నిందితులను ఫైజాబాద్ జైలుకు తరలించారు. కాగా.. నిందితులను విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరనున్నారు. జ్యుడీషియల్ రిమాండ్ తర్వాత కస్టడీపై కోర్టు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
కాగా.. రామమందిర విరాళాల దొంగతనం ఆరోపణల నేపథ్యంలో ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపర్ రాయ్, ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ ఘటన జాతీయ రాజకీయాల్లో, ఆధ్యాత్మిక వర్గాల్లో సంచలనానికి దారి తీసింది. 8 మందిపై ఎఫ్ఐఆర్, అరెస్ట్ తర్వాత రాజీనామాలు చేయడం చర్చనీయాంశమయింది. ఈ చోరీలో ఇంకా ఎవరెవరి హస్తం ఉందన్నదానిపై యూపీ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.






