హీరోగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కొడుకు ఎంట్రీ.. నాకు పంచిన ప్రేమే తనకు ఇవ్వడంటూ కామెంట్స్

by Chukka Sudharani |

ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ కుమారుడు సుస్వర తరంగ్ హీరోగా వెండితెర ఎంట్రీకి సిద్ధం అయ్యాడు.

హీరోగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కొడుకు ఎంట్రీ.. నాకు పంచిన ప్రేమే తనకు ఇవ్వడంటూ కామెంట్స్
X

దిశ, సినిమా: ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ కుమారుడు సుస్వర తరంగ్ హీరోగా వెండితెర ఎంట్రీకి సిద్ధం అయ్యాడు. వీరేష్ కోకా దర్శకత్వంలో సురవి విజన్స్ బ్యానర్‌పై పి చక్రధర రెడ్డి నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం తాజాగా పూజా కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమైయింది. ముహుర్తపు సన్నివేశానికి డైరెక్టర్ డాలీ క్లాప్ కొట్టగా.. గంటా రవితేజ కెమరా స్విచ్ ఆన్ చేశారు. పలువురు సినీ ప్రముఖులు, చిత్ర బృందం ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇందులో దివ్యాని మొండల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మూవీ లాంచింగ్ ఈవెంట్‌లో వందేమాతరం శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘నేను 275 కు పైగా సినిమాలకు పని చేశాను.

ప్రేక్షకులు నాకు ఎంతో ప్రేమ, అభిమానాన్ని అందించారు. ఇప్పుడు ఈ సినిమాతో మా అబ్బాయి హీరోగా పరిచయం అవుతున్నాడు. అదే ప్రేమ, అభిమానాన్ని తనపై కూడా చూపిస్తారని కోరుకుంటున్నాను. దర్శకుడు వీరేష్ చాలా అద్భుతమైన కాన్సెప్ట్‌ను రూపొందించారు. ఆయన చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ప్రస్తుత యువత ఆలోచనా విధానాన్ని ప్రతిబింబించే కథ ఇది. ఈ సినిమాతో మా అబ్బాయికి మంచి పేరు వస్తుందని, మీ అందరి ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నాను. నిర్మాత చక్రధర్ రెడ్డి ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు ఈ కథను ఎంతో అద్భుతంగా మలిచారు. ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాను. చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికీ నా అభినందనలు’ అని తెలిపారు.

Next Story