తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు..

by Kodari Anjali |

వృత్తిలో భాగంగా ఓ గీత కార్మికుడు తాటి చెట్టు పైకి ఎక్కి కల్లు తీసే క్రమంలో ప్రమాదవశాత్తు జారి పడ్డాడు.

తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు..
X

దిశ, మల్యాల: వృత్తిలో భాగంగా ఓ గీత కార్మికుడు తాటి చెట్టు పైకి ఎక్కి కల్లు తీసే క్రమంలో ప్రమాదవశాత్తు జారి పడడంతో తీవ్ర గాయాలైన సంఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని రామన్నపేట లో చోటు చేసుకుంది. గీత కార్మికుడు కొత్తకొండ శ్రీనివాస్ నూకపెల్లి గ్రామంలో కల్లు మండవలో కల్లు గీసేందుకు తాటిచెట్టు ఎక్కాడు. చెట్టు పై నుంచి ప్రమాదవశాత్తు కింద జారి పడగా శ్రీనివాస్ కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనంలో జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. నడుము భాగం, ప్రక్కటేముకలు ఫ్రాక్చర్ అయినట్లు డాక్టర్ నిర్ధారించారు. ప్రభుత్వం వారిని ఆదుకోవాలని కుటుంబ సభ్యులకు కోరుతున్నారు.

Next Story