- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
100 రెట్లు చేస్తాం.. వైసీపీ సోషల్ మీడియాకు కిరణ్ రాయల్ వార్నింగ్
గతంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై తాను చేసిన కామెంట్ల వీడియోను కట్ చేసి వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ దుష్ప్రచారం చేస్తోందని తిరుపతి జనసేన ఇంచార్జి కిరణ్ రాయల్ మండిపడ్డారు.

దిశ, వెబ్ డెస్క్: గతంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Ys Jagan Mohan Reddy)పై తాను చేసిన కామెంట్ల వీడియోను కట్ చేసి వైసీపీ సోషల్ మీడియా(Ycp Social Media) బ్యాచ్ దుష్ప్రచారం చేస్తోందని తిరుపతి జనసేన ఇంచార్జి కిరణ్ రాయల్(Tirupati Janasena Incharge Kiran Rayal) మండిపడ్డారు. అయితే దాని వల్ల తనకేం నష్టంలేదన్న విషయం పేటిఎం బ్యాచ్‌కు తెలియదని ఎద్దేవా చేశారు. ఆ కట్ చేసిన వీడియో వల్ల జగన్ పరువే పోతుందని తెలిపారు. తమ అధినేత పవన్ కల్యాణ్‌పై జగన్ చేసిన వ్యక్తగత కామెంట్ల వల్ల తాను తీవ్రమైన విమర్శలు చేశానని, ఆ సమయంలో తనపై కేసులు సైతం పెట్టారని, ఆయా కేసుల్లో బెయిల్ కూడా తీసుకున్నానని గుర్తు చేశారు. జగన్ అధికారంలో ఉన్న సమయంలోనే తాను భయపడలేదని, ఇప్పుడు భయపడతానా అని ప్రశ్నించారు. సులబ్ కాంప్లెక్‌లో పని చేసిన వారికి రూ. 500 ఇచ్చి తనపై విమర్శలు చేయించారని, ఆ సమయంలోనూ తాను ఘాటు వ్యాఖ్యలు చేశానని చెప్పారు. తానిచ్చిన ఇంటర్వూలో ఓ డైలాగ్ ను కట్ చేసి జగన్ మోహన్ రెడ్డిని విమర్శించిన సంగతిని ప్రపంచానికి వైసీపీ సోషల్ మీడియా వాళ్లే తెలియజేశారని కిరణ్ రాయల్ ఎద్దేవా చేశారు.
సొంతవాళ్లపైనే విమర్శలా...
‘‘సొంత చెల్లి షర్మిల వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పుట్టలేదని వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేసింది తమరు. జగన్ దగ్గర పని చేస్తున్న పేటిఎం పాలేరుగాళ్లూ తమరే. అలాంటా వైసీపీ వాళ్లు కూడా మాట్లాడుతున్నారు.’’ అని విమర్శలు చేశారు. వైసీపీ వాళ్లు వ్యక్తిగత విమర్శలు మానిస్తే తాము మానేస్తామని చెప్పారు. కానీ ఇదే కంటిన్యూ అవుతుదంటే తాము 100 రెట్లు చేస్తామని వైసీపీ సోషల్ మీడియాకు కిరణ్ రాయల్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.






