- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మురుగు కాలువలో బర్త్ డే వేడుకలు జరుపుకున్న కార్పొరేటర్
ఎవరైనా బర్త్ డే వేడుకలు ఇంట్లో లేదా ఏదైనా బాంక్వెట్ హాల్ లో సెలెబ్రేట్ చేసుకుంటారు.

దిశ, వెబ్ డెస్క్ : ఎవరైనా బర్త్ డే వేడుకలు ఇంట్లో లేదా ఏదైనా బాంక్వెట్ హాల్ లో సెలెబ్రేట్ చేసుకుంటారు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఓ వ్యక్తి వినూత్నంగా బర్త్‌డే వేడుకలు నిర్వహించాడు. మురుగు నీరు నిల్వ ఉన్న డ్రైనేజీలో జరుపుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో వివరాల ప్రకారం.. యూపీలోని ఆగ్రాలోని ఓ బీజేపీ కార్పొరేటర్ నగరంలో డ్రైనేజీ వ్యవస్థ గురించి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సిబ్బంది పట్టించుకోకవడంతో, డ్రైనేజీ కాలువలు నాలుగు చినుకులు పడినా పొంగి ప్రవహిస్తుండతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. నగర పాలక సిబ్బంది, అధికారుల నిర్లక్ష్యాన్ని, ప్రజాప్రతినిధుల వైఫల్యాన్ని నిరసిస్తూ డ్రైనేజీలోనే టేబుల్ ఏర్పాటు చేసి తన బర్త్ డే కేక్ కట్ చేశాడు. ఈ కార్యక్రమంలో స్థానికులు కూడా పాల్గొని నినాదాలు చేశారు.
తాజ్ మహల్ వరల్డ్ టూరిస్టులకు స్పెషల్ అట్రాక్షన్ నిలుస్తున్నప్పటికీ, టూరిజంతో కోట్ల రూపాయలు వస్తున్నప్పటికీ నగర మౌలిక సదుపాయాలపై నిర్లక్ష్యాన్ని నిరసిసన వ్యక్తం చేసారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రజలు మౌలిక సదుపాయాల కల్పనలో పాలకులు విఫలమయ్యారని ఆరోపిస్తూ, సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. డ్రైనేజీలో బర్త్‌డే వేడుకలు నిర్వహించడం ద్వారా తమ నిరసనను వినూత్నంగా వ్యక్తం చేసిన ఈ ఘటన ప్రస్తుతం విస్తృతంగా చర్చనీయాంశమవుతోంది.






